నవీన్ చంద్ర హీరోగా వేణు మూవీస్ ప్రొడక్షన్ నెం.1

  • IndiaGlitz, [Saturday,May 21 2016]

గతంలో రెండు దశాబ్దాల పాటు పంపిణీ రంగంలో మూడు వందలకు పైగా చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ వేణు మూవీస్ ఇప్పుడు చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. పసుపులేటి శ్రీనివాసరావు సమర్పణలో నవీన్ చంద్ర హీరోగా పసుపులేటి వేణు మాధవ్ నిర్మాతగా అత్యున్నత సాంకేతిక విలువలతో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను రూపొందిస్తున్నారు. జి.గోపి ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ సినిమా ఆగస్టు నుండి రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకోనుందని చిత్రానికి సంబంధించిన నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: వి.కావేరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.శ్రీనివాస్.

More News

మే 27న మాస్‌ హీరో విశాల్‌ 'రాయుడు'

మాస్‌ హీరో విశాల్‌, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు'. విశాల్‌ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

తమన్నా పెంచుతుంది....

మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘అభినేత్రి’లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రభుదేవా ప్రధానపాత్రలో కనపడనున్నాడు.

జాగ్వార్ లో జ‌గ్గుభాయ్

క‌థానాయ‌కుడుగా..కుటుంబ క‌థా చిత్రాల్లో న‌టించి ప్రత్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకుని....లెజెండ్ చిత్రంతో ప్ర‌తి నాయ‌కుడుగా కూడా ఆక‌ట్టుకున్నాడు జ‌గ‌ప‌తి.

మోహ‌న్ లాల్ హ్యాపీ బ‌ర్త్ డే...

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుని..ప్రేక్షకుల హృద‌యాల్లో సుస్ధిర స్ధానం ఏర్పరుచుకున్న మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్. మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ,  హిందీ చిత్రాల్లో న‌టించిన మోహ‌న్ లాల్ ఉత్త‌మ న‌టుడుగా జాతీయ అవార్డ్ కూడా అందుకున్నారు.

చిరు తో డ్యాన్స్ చేయ‌నున్న ఎమ్మెల్యే...

మెగాస్టార్ చిరంజీవి తో డ్యాన్స్ చేయ‌డానికి ఎమ్మెల్యే రెడీ అవుతుంద‌ట‌. ఎవ‌రా ఎమ్మెల్యే అనుకుంటున్నారా..? రియ‌ల్ లైఫ్ ఎమ్మెల్యే కాదు...రీల్ లైఫ్ ఎమ్మెల్యే. అల్లు అర్జున్ న‌టించిన స‌రైనోడు సినిమాలో ఎమ్మెల్యే పాత్ర పోషించింది హీరోయిన్ కేథ‌రిన్.