ప్రతి లవర్ ఓ ఇడియట్ - నవీన్ చంద్ర
- IndiaGlitz, [Wednesday,August 09 2017]
నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా నటిస్తున్న చిత్రం 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్'. కొత్తపల్లి అనురాధ సమర్పణలో అనురాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై కొత్తపల్లి ఆర్.రఘుబాబు, కె.బి.చౌదరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ వోధిరాల దర్శకుడు. ఈ సినిమా టీజర్ హైదరాబాద్‌లో విడుదలైంది.
'దర్శకుడు అజయ్‌గారు కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించాయి. డైలాగ్స్ చాలా బావున్నాయి. గిరీష్ గంగాధర్, ఆర్థర్ ఎ.విలన్స్ ఇద్దరూ సినిమాటోగ్రాఫర్లు ఈ సినిమా కోసం పనిచేశారు. పెద్ద టెక్నిషియన్స్‌తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి లవర్ ఒక ఇడియట్టే. టైటిల్లో ఉన్నట్లే నేనొక ఇడియట్ లాంటి లవర్‌లా సినిమా కనపడతాను. నివేదా థామస్ చాలా ప్రొఫెషనల్. ఈ సినిమాలో కొత్తగా కనపడుతుంది. షూటింగ్ పనులన్నీ పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చాలా విలువలున్న ప్రేమకథ. కామెడి సహా అన్ని ఎలిమెంట్స్ ఉండే సినిమా. సినిమా బాగా వచ్చింది. కొత్తపల్లి ఆర్.రఘుబాబు, కె.బి.చౌదరిలకు థాంక్స్. సినిమాను ఎంజాయ్ చేస్తారని హీరో నవీన్ చంద్ర తెలిపారు.
కథ అంతా విన్న తర్వాత నవీన్ చంద్ర అయితే సరిపోతాడనిపించి, ఆయనకు కథ చెప్పడం, ఆయన ఓకే చెప్పడం జరిగాయి. నివేదా థామస్, నవీన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాం. దర్శకుడు అజయ్ చాలా కేర్ తీసుకున్నాడు. సినిమా బాగా వచ్చిందని నిర్మాత కొత్తపల్లి ఆర్.రఘుబాబు అన్నారు. నేను సుకుమార్‌గారి దగ్గర ఆర్య నుండి 100% లవ్ వరకు పనిచేశాను. సబ్జెక్ట్ బావుంటుంది. ఓ జూలియట్, ఓ ఇడియట్ లవ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి కథ తయారు చేశాం. సీన్స్ అన్నీ బాగా వచ్చాయి. కామెడి, ఎమోషన్స్ అన్ని చక్కగా ఉంటాయి. ఇప్పటికీ నవీన్ అందరూ అందాలరాక్షసి నవీన్ అంటుంటారు. ఈ సినిమాతో జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ నవీన్‌చంద్ర అంటారని దర్శకుడు అజయ్ వోధిరాల తెలిపారు.
నవీన్‌చంద్ర, నివేదా థామస్, అలీ, తాగుబోతు రమేష్, దేవన్, అభిమన్యుసింగ్, కాట్రాజ్, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః అర్థర్ ఎ.విల్సన్, గిరీష్ గంగాధరన్, సంగీతంః రతీస్ వేగ, ఎడిటింగ్ః ఎస్.బి.ఉద్ధవ్, కళః రాజీవ్ నాయర్, ఫైట్స్ః రన్రవి, జాషువా, కథః రాజ్ శివ సధాని, మాటలుః కె.వేణుగోపాల్ రెడ్డి, శ్రీనాథ్ బదినేని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః రవితేజ, లైన్ ప్రొడ్యూసర్ః సురేష్ కొండవీటి, నిర్మాతలుః కొత్తపల్లి ఆర్.రఘుబాబు, కె.బి.చౌదరి, దర్శకత్వంః అజయ్ వోధిరాల.