హీరోయిన్ల లక్ పై ఆధార పడ్డ హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
చూడ్డానికి అందంగా ఉంటాడు. బాగానే యాక్ట్ చేస్తాడు. కానీ అదృష్టమే అతన్ని దూరం పెడుతోంది. ఆ హీరో మరెవరో కాదు. 'అందాల రాక్షసి'తో పరిచయమైన నవీన్ చంద్ర. ఆ తరువాత 'దళం' వంటి ఒకటీ ఆరా సినిమాల్లో చేసినా విజయలక్ష్మీ వరించలేదు. ఈ నేపథ్యంలో తన కొత్త సినిమాలపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు ఇతగాడు.
అవి రెండు కూడా నెల రోజుల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముందుగా ఈ నెల 6న స్వాతితో చేసిన 'త్రిపుర' రానుంది. వచ్చే నెలలో ఏమో తన తొలి చిత్ర కథానాయిక లావణ్య త్రిపాఠితో చేసిన 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' రానుంది. 'కార్తికేయ' వంటి హిట్ చిత్రం తరువాత స్వాతి.. 'భలే భలే మగాడివోయ్' వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తరువాత లావణ్య నుంచి వస్తున్న ఈ చిత్రాలతోనైనా.. వారి లక్కుని తోడు చేసుకుని నవీన్ హిట్ కొడతాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com