నవీన్ చంద్ర '28°c' ఫస్ట్‌లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నవీన్ చంద్ర, షాలిని, వడ్నికట్టి హీరో హీరోయిన్‌గా వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్ సైడ్ సినిమాస్ పతాకాలపై డా.అనీల్ విశ్వనాథ్ దర్శకత్వంలో అభిషేక్ సాయి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం '28°c'. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ... నిర్మాత అభిషేక్ సాయి మాట్లాడుతూ - "28°c అనే టైటిల్ అందరిలో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. నవీన్‌చంద్రగారికి ఈ సినిమాతో మంచి హిట్ వస్తుందనే నమ్మకం ఉంది. డా.అనీల్ విశ్వనాథ్‌గారు సరికొత్త కథ, కథనాలతో అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. శ‌్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ వర్క్ అందిస్తున్నారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కిట్టు విస్సాప్రగడగారు కథకు తగ్గ మాటలు, మ్యూజిక్‌కి అనుగుణంగా పాటలను అందించారు. సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వలోనే సినిమా విడుదల తేదిని ప్రకటిస్తాం" అన్నారు.
నవీన్ చంద్ర, షాలిని, వడ్నికట్టి, ప్రియదర్శి, వైవా హర్ష, రాజా రవీంద్ర, అభయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్, పాటలు: కిట్టు విస్సాప్రగడ, ఎడిటర్: గ్యారీ బి.హెచ్, సంగీతం: శ‌్రావణ్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సహ నిర్మాత: విక్రమ్ జుపూడి, సంజయ్ జుపూడి, నిర్మాత: అభిషేక్ సాయి, దర్శకత్వం: డా.అనీల్ సాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com