జర్నలిజం పై సెటైర్ వేస్తున్ననవదీప్..
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో నవదీప్ గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి తన ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుపుకుంటుండగా పట్టుబడ్డారు. ఈ పార్టీలో నవదీప్ తో పాటు పలువురు నటులు కూడా ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే..ఈ వార్తలను ప్రసారం చేసిన మీడియా పై నవదీప్ ట్విట్టర్ లో స్పందిస్తూ....ఎలాగో వీడి మీద చాలా ఉన్నాయి కదా..ఇంకోటి వేసేద్దాం. జనాలు నమ్ముతారు ఆనందిస్తారు. టి.ఆర్.పి వస్తుందేమో...దీనెమ్మా జీవితం అంటూ స్పందించారు.
అంతటితో ఆగలేదు...హిలేరియస్ న్యూస్ ఆఫ్ ది డే. పేరెంట్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో డిన్నర్ చేస్తే రేవ్ పార్టీ అంటారా..ఇదేమిటని నాకు తెలిసిన వాళ్లను అడిగితే జర్నలిజమ్ అంటున్నారు అంటూ మరో ట్వీట్ వేసాడు. ఫామ్ హౌస్ లో ఏం జరిగిందో విజువల్స్ లో చూస్తే తెలుస్తుంది. ఇదేమి ప ట్టించుకోకుండా...తప్పు చేసింది కాకుండా ఏం జరిగిందో చూపిస్తున్న మీడియా పై జోకులు - సెటైర్స్ వేస్తున్నాడు ఈ హీరో నవదీప్ గారు. ఈయన ఎప్పుడు మారతాడో..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com