రేవ్ పార్టీతో మరోసారి వార్తల్లో నిలిచిన నవదీప్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో నవదీప్ కి రంగారెడ్డి జిల్లా మోమిన్ పేట్ మండలం చక్రంపల్లిలో ఫామ్ హౌస్ ఉంది. శుక్రవారం అర్ధరాత్రి నవదీప్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతుందని..కొందరు సినీ ప్రముఖులు మద్యం తాగుతూ డ్యాన్సర్స్ తో హంగామా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఫామ్ హౌస్ పై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఉమ్మడిగా దాడులు నిర్వహించారు.
అయితే పార్టీలో పాల్గొన్న కొంత మంది హీరోలు, నటులు పోలీసులు రంగప్రవేశం చేయడం పరారయ్యారు. ఈ పార్టీలో పోలీసులు విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీ మేనేజర్ అరుణ్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ప్రముఖ నటుడిని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ నటుడి వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com