చరణ్ ధృవ లో యువ హీరో..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధృవ. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. తని ఓరువన్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. తాజాగా ఈ చిత్రంలో యువ హీరో నవదీప్ ఎంట్రీ ఇచ్చాడు. రామ్ చరణ్ ఈ చిత్రంలో పోలీస్ గా నటిస్తున్నారు.
ఈ పోలీస్ పాత్రకు క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు. తని ఓరువన్ లో హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ను గణేష్ వెంకట్రామన్, హరీష్ ఉత్తమన్ లు పోషించారు. ఈ ఇద్దరిలో ఎవరి పాత్ర కోసం నవదీప్ ని తీసుకున్నారో తెలియదు కానీ...నవదీప్ పాత్రకి మాత్రం ఇంపార్టెన్స్ ఉంటుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో విలన్ గా తని ఓరువన్ లో నటించిన అరవింద్ స్వామి ఈ చిత్రంలో కూడా విలన్ గా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని ముందుగా ఆగష్టులో రిలీజ్ చేయాలనుకున్నా...కానీ తాజా సమాచారం ప్రకారం దసరాకి రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments