డిసెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతున్న ధనుష్ 'నవమన్మథుడు'
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణమైన పాత్రలతో రాణిస్తూ తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన మాస్, కమర్షియల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నధనుష్ హీరోగా సమంత, ఎమీజాక్సన్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం తంగ మగన్`. ఈ చిత్రాన్ని`నవమన్మథుడు` అనే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. డి.ప్రతాప్ రాజు సమర్పణలో బృందావన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెలుగులో విడుదలవుతుంది. వేల్ రాజ్ దర్శకుడు. ఎన్.వెంకటేష్, ఎన్.రవికాంత్ నిర్మాతలు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ..
చిత్ర నిర్మాతలు ఎన్.వెంకటేష్, ఎన్.రవికాంత్ మాట్లాడుతూ `ధనుష్ విలక్షణమైన హీరోయిజాన్ని ప్రదర్శించే హీరో. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గతంలో ధనుష్‌తో రఘువరన్ బి.టెక్(తమిళంలో వేలై ఇల్లాద పట్టదారి) వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన వేల్‌రాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రంగా సినిమా రూపొందింది. యువ సంగీత కెరటం అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఆడియో డిసెంబర్ 11న విడుదలవుతుంది. అలాగే సినిమాను డిసెంబర్ 18న గ్రాండ్ లెవల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
ధనుష్, సమంత, ఎమీజాక్సన్, రాధికా శరత్‌కుమార్, కె.ఎస్.రవికుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః అనిరుధ్ రవిచంద్రన్, కెమెరాః ఎ.కుమరన్, ఎడిటింగ్ః ఎం.వి.రాజేష్‌కుమార్, సహ నిర్మాతలుః ఎం.డి.ఎం.ఆంజనేయరెడ్డి, కె.యస్.రెడ్డి, దర్శకత్వంః వేల్‌రాజ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com