‘నాట్యం’ టీజర్: నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం

  • IndiaGlitz, [Wednesday,February 10 2021]

ప్ర‌ముఖ కూచిపూడి నృత్య‌కారిణి సంధ్య‌రాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'నాట్యం'. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి రేవంత్ కోరుకొండ దర్శకుడిగానే కాకుండా స్క్రిప్టు, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఉపాసన విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీయార్ ట్విటర్ ద్వారా ఈ టీజర్‌ను కొద్ది సేపటి క్రితం విడుదల చేశాడు.

‘నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం’ అనే డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఈ టీజర్‌ ఆద్యంతం నాట్యం, శాస్త్రీయ సంగీతం నేపథ్యంలో సాగింది. నాట్యం యొక్క ప్రాధాన్యతను వెల్లడించారు. ఈ సినిమా టీజర్ చూస్తుంటే మరో ‘సాగరసంగమం’ను ప్రేక్షకులకు చూపించాలనే తపన కనిపించింది. మరి ఈ రోజుల్లో ఇలాంటి సినిమా చేయడమంటే ఒక సాహసమనే చెప్పాలి. ‘నాట్యం’తో కలిపి ఒక లవ్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారు కాబట్టి ఆదరణ బాగా దక్కే అవకాశముందని తెలుస్తోంది. నిశృంక‌ల ఫిల్స్మ్ బ్యాన‌ర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి రేవంత్ కోరుకొండ డైరెక్ట‌ర్. డైరెక్షన్ మాత్రమే కాదు.. క‌మ‌ల్‌కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్, శుభలేఖ సుధాకర్ భానుప్రియ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

More News

ఆ విషయం నేనెప్పుడూ ఊహించలేదు.. కన్నీళ్లొచ్చాయి: కృతి శెట్టి

హీరోయిన్‌గా తొలిసారిగా ‘ఉప్పెన’ సినిమా ద్వారా కృతిశెట్టి వెండితెరకు పరిచయం కాబోతోంది. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.

టైమ్ లైన్ ఫిక్స్ చేసుకున్న జక్కన్న...!

మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆఫ్ ప్యాన్ ఇండియా ‘ఆర్ఆర్ఆర్‌(ర‌ణం రౌద్రం రుధిరం)’.

స్టైలిష్ స్టార్ కోసం కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌యత్నాలు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. అయితే ఈయ‌న‌తో ఓ డిఫ‌రెంట్ సినిమా చేయాల‌ని కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఆలోచ‌న చేశాడ‌ట‌.

బాల‌కృష్ణ 106... ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో డీల్ పూర్తి..!

సూప‌ర్ హిట్ కాంబినేష‌న్స్‌కి ఉండే క్రేజే వేరు. సినిమా సెట్స్‌పై ఉండ‌గానే బిజినెస్ డీల్స్ పూర్తై పోతుంటాయి.

‘రాధేశ్యామ్‌’ టీజ‌ర్ కోసం పూజా హెగ్డే డ‌బ్బింగ్‌...

రెబల్‌స్టార్ ప్ర‌భాస్, పూజా హెగ్డే జోడీగా న‌టిస్తోన్న పీరియాడిక్ లవ్ స్టోరి‘రాధేశ్యామ్‌’. ఈ సినిమా టీజ‌ర్‌ను వేలంటెన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల