ప్రకృతి, సైన్స్, అనుబంధాలు, ఆరోగ్యం, ఆనందం.. 'సంక్రాంతి' వెనుక పరమార్థం ఇదే

  • IndiaGlitz, [Saturday,January 14 2023]

భారతీయుల పండుగలు, ఆచార వ్యవహారాల వెనుక ఖచ్చితంగా ఏదో ఒక శాస్త్రీయత దాగి వుంటుంది. కుటుంబ బంధాలు, మనుషుల మధ్య అనుబంధాలను పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో వుంచుకుని వేల ఏళ్ల నాడే మన రుషులు, పూర్వీకులు కొన్ని విధానాలను ప్రవేశపెట్టారు. ఇక.. తాజాగా సంక్రాంతి పండుగ విషయానికి వస్తే..తెలుగు వారి పెద్ద పండుగ. పేర్లు మారినా వేరు వేరు పేర్లతో భారతదేశంలోని పలు ప్రాంతాల ప్రజలు సంక్రాంతి జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. భోగి మంటలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, పిండి వంటలు, భోగి పళ్లు, యువత కేరింతలు ఇవన్నీ కనిపించేవి. హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నాం. మూడు రోజుల పాటు జరుపుకునే పెద్ద పండుగ వెనుక ఎన్నో విశేషాలు, శాస్త్రీయ అంశాలు వున్నాయి.

భోగి:

సంక్రాంతికి ఒక రోజు ముందుగా జరుపుకునేది భోగి పండుగ. ఈరోజున ఇంటి ముందు కుటుంబ సభ్యులంతా ఇంట్లోని పాత కలప, పనికిరాని వస్తువులు తీసుకొచ్చి ఇంటి ముందు పెద్ద మంట వేస్తారు. శ్రీ రంగనాథ స్వామిలో గోదా దేవి లేనమై భోగాన్ని పొందినందుకు గుర్తుగా భోగి పండుగ నిర్వహిస్తారనిపెద్దలు చెబుతారు. ధనుర్మాసం సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలు, పిడకల్ని భోగి మంటల్లో వేస్తారు. ఇలా చేయడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి. మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి రిలీఫ్ లభిస్తుంది . భోగి మంటలు పెద్దగా రావడానికి రావి, మామిడి, మేడి వంటి ఔషధాల చెట్ల మొద్దులను కాలుస్తుంటారు. ఇవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు. ఇవన్నీ కూడా ఔషధ గుణాలు వున్నవి కావడం వల్ల.. ఇవి కాలిన తర్వాత వచ్చిన గాలిని పీల్చడం వల్ల శరీరంలోని 72 వేల నాడులు ఉత్తేజితం అవుతాయని పెద్దలు అంటారు. అంతేకాదు.. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఇలా అంతా ఒక్కచోట చేరి పండుగ జరుపుకోవడం వల్ల అనుబంధాలు బలపడతాయి.

భోగి పళ్లు :

భోగి రోజున రేగి పండ్లను పిల్లల మీద పోయిడం ఆనాదిగా వస్తున్న ఆచారం . ఆ రోజున ప్రతి ఇంట్లో భోగి పళ్ల వేడుక నిర్వహిస్తారు. సంస్కృతంలో రేగి చెట్టును బదరీ వృక్షంగా పిలుస్తారు. రేగి చెట్లు, రాగి పండ్లను భక్తులు శ్రీమన్నారాయణుడి ప్రతిరూపంగా భావిస్తారు. అలాగే ఈ ఫలం సూర్య భగవానునికి ప్రీతిపాత్రమైన ఫలం. ఆ రోజున రేగుపళ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. దీని వల్ల భగవంతుడి అనుగ్రహం పిల్లలపై వుంటుందని దిష్టి తొలగిపోతుందని అంటారు. అలాగే తలపై భోగి పండ్లను పోయడం వల్ల శిరస్సు పై భాగంలో వుండే ఆ బ్రహ్మరంధ్రం ప్రేరేపితమై చిన్నారులు జ్ఞానవంతులు అవుతారని పెద్దలు అంటారు. అంతేకాకుండా.. సూర్యుని నుంచి వచ్చే ప్రాణశక్తిని అధికంగా గ్రహించే తత్వమున్న రేగి పండు వల్ల దానిలో దాగివున్న విద్యుచ్ఛక్తి, శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది.

బొమ్మల కొలువు :

భోగి నాడు ఖచ్చితంగా జరుపుకునే మరో వేడుక బొమ్మల కొలువు. సంతానం, పాడిపంటలు, సుఖమయ కుటుంబ జీవనం కోసం చాలా మంది బొమ్మల కొలువు నిర్వహిస్తారు. భోగి నాడు బొమ్మల కొలువు పెట్టి.. దానిని కనుమ వరకు కొనసాగిస్తారు . ఇంట్లో వున్న బొమ్మలను శ్రీమహావిష్ణువు దశావతారాలను అనుసరించి బొమ్మలను పేరుస్తారు. మూడు, ఐదు , తొమ్మిది వరుసలలో బొమ్మలను పేరుస్తారు. దీని వెనుక కూడా మన పెద్దలు సోషల్ నెట్‌వర్కింగ్ అనే కాన్సెప్ట్‌ను తయారు చేశారు. ఇరుగు పొరుగు, బంధు మిత్రులంతా ఒక్క చోట చేరడం వల్ల అనుబంధాలు బలపడతాయనేదే ఇక్కడ లాజిక్.

ధాన్యపు కుచ్చులు :

ఇప్పుడు ఈ విషయాన్ని చాలా మంది మరిచిపోయారు కానీ.. ఒకప్పుడు గ్రామాలలో సంక్రాంతి నాడు ప్రతి ఇంటి గుమ్మం వద్ద ధాన్యపు కుచ్చులు కనిపిస్తాయి. పంట కోత కోసిన తర్వాత వరి కంకులను ఇంటికి వేలాడదీయడం వల్ల పక్షులు వాటిని తిని జీవిస్తాయి. తాను బతుకుతూ ఇతర జీవరాశిని తనతో పాటు బతకనివ్వడమే ఈ ధాన్యపు కుచ్చుల వెనుక అసలు కారణం. కానీ ఇప్పుడు చాలా ఇళ్లలో ఈ సంప్రదాయం కనిపించడం లేదు.

పశువుల పూజ:

ఎండ, వాన, చలి .. కష్టసుఖాల్లో తనకు తోడుగా వుండి తనకు ధాన్య సంపదను ఇచ్చే పశువులను ఖచ్చితంగా పూజించాలనే నిబంధనను మన పూర్వీకులు పెట్టారు. కనుమ రోజున పశువులకు రెల్లు గడ్డితో దిష్టి తీసి వాటికి అలంకారాలు చేసి పూజిస్తారు. వాటికి పులగం లేదా పొంగలిని వండి సమర్పిస్తారు. ఇక ఈరోజున మన తల్లిదండ్రులు, పెద్దలు, పూర్వీకులను పూజించాలని కూడా ఒక సంప్రదాయాన్ని పెట్టారు. గారెలు, మాంసంతో పెద్దలకి పూజి చేసి వారి ఆశీర్వచనాలు పొందడం అనేది వారికి మనం ఇచ్చే గౌరవం. తల్లిదండ్రుల నుంచే మనకు ఈ శరీరం వచ్చిందన్న సంగతి మరచిపోకూడదు. ఈ రోజు పెద్దలను తలచుకుని మనం కాస్త కృతజ్ఞతాపూర్వకంగా నడుచుకోవాలి.

More News

Vande Bharat: రేపు పట్టాలెక్కనున్న సికింద్రాబాద్ - వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ .. టైమింగ్స్, ఛార్జీలు ఇవే

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభానికి సిద్ధమైంది.

'వాల్తేరు వీరయ్య' లో నాన్నగారిని చూస్తుంటే  పండగలా వుంది: సుస్మిత కొణిదెల

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య'

Shruti Hassan : ఆరోగ్యంపై దుష్ప్రచారం.. మెంటల్  డాక్టర్‌ దగ్గరకెళ్లండి : గట్టిగా ఇచ్చిపడేసిన శృతీహాసన్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం విశాఖలో జరిగింది.

Waltair Veerayya : బాస్ సినిమా ఆలస్యం.. కట్టలు తెంచుకున్న అభిమానం, థియేటర్ అద్దాలు ధ్వంసం

సినీతారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులను మనదేశంలో ప్రజలు దైవంగా భావిస్తారు.

Nandamuri Balakrishna : బాలయ్య ‘‘వీరసింహారెడ్డి’’ కోసం మంచు లక్ష్మీ ఫ్రీ ప్రమోషన్.. ఆ స్టెప్స్ అదరహో

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.