"స్త్రీ ఎవ్వరికీ దాసి కాదు... ఆఖరికి దేవుడికి కూడా" : ఆకట్టుకుంటున్న శ్యామ్ సింగరాయ్ టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. 1970లలో కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కెరీర్‌లో తొలిసారి నాని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ తన సినిమాను ఒకేసారి విడుదల చేస్తుండం విశేషం.
అయితే మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే విడుదలైన ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ సాంగ్ ప్రోమోకు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్ విడుదల కార్యక్రమం గురువారం ఉదయం ఏఎంబీ మాల్‌లో ఘనంగా జరిగింది. దీనిలో భాగంగా టీజర్‌ను సోషల్‌మీడియా ద్వారా చిత్రబృందం విడుదల చేసింది. ‘‘స్త్రీ ఎవ్వరికీ దాసి కాదు. ఆఖరికి దేవుడికి కూడా. ఖబడ్దార్’’ అంటూ శ్యామ్‌సింగారాయ్ పాత్రలో నాని చెప్పే డైలాగ్‌లు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపేలా ఉన్నాయి. టీజర్ విషయానికి వస్తే.. బెంగాల్‌లో కొందరు అమ్మాయిలపై అత్యాచారాలు చేస్తుంటారు.. వారికి ఎవరూ ఎదురు తిరిగేవారుండరు . అలాంటి సమయంలో రైటర్‌గా వున్న హీరో వారికి అండగా నిలబడతాడు. పెద్ద గుడి, చిన్న బోట్లు కాలిపోవడం.. మహిళలపై కొందరు దాడులు చేయడం అన్నీ ఈ టీజర్‌లో చూడొచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments