నేచుర‌ల్ స్టార్ నాని సెంటిమెంట్..!

  • IndiaGlitz, [Friday,September 30 2016]

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం మ‌జ్ను. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న అను ఇమ్మాన్యుయేల్, ప్రియ న‌టించారు. ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వ‌ర్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇటీవ‌ల రిలీజైన విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం మ‌జ్ను పాజిటివ్ టాక్ తో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా మ‌జ్ను టీమ్ వైజాగ్ లో విజ‌య‌యాత్రను ప్రారంభించింది.

ఈ సంద‌ర్భంగా నాని మాట్లాడుతూ... మ‌జ్ను చిత్రాన్ని ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులంద‌రికీ ధ‌న్య‌వాదాలు. వైజాగ్ నాకు సెంటిమెంట్. అందుక‌నే నా సినిమాల‌ విజ‌య‌యాత్ర‌ల‌ను వైజాగ్ నుంచే ప్రారంభిస్తుంటాను. విశాఖ‌లో ప్రారంభ‌మైన విజ‌య‌యాత్ర రాజ‌మండ్రి, ఏలూరు, విజ‌య‌వాడ మీదుగా హైద‌రాబాద్ చేరుకుంటుంది అని చెప్పారు.