అభిమానం చాటుకున్న నాని ఫ్యాన్స్.. 63 అడుగుల ‘‘శ్యామ్ సింగరాయ్’’ కటౌట్‌, ఫోటోలు వైరల్

  • IndiaGlitz, [Wednesday,December 22 2021]

భారత్‌లో సినీతారలకు వున్న క్రేజ్ సాధారణమైంది కాదు. వారిని దైవంలా ఆరాధిస్తారు అభిమానులు. వాళ్ల ఒంటిపై ఈగ వాలనివ్వరు. ఎవరైనా తమ అభిమాన హీరోని పల్లెత్తు మాటంటే అస్సలు ఊరుకోరు. ఇక వాళ్ల పుట్టినరోజులు, సినిమా విడుదల సందర్భాల్లో జాతర మామూలుగా వుండదు. అన్నదానం, రక్తదానం, సహాయక కార్యక్రమాలు చేస్తూ వుంటారు. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నానీపై అభిమానం చాటుకున్నారు ఫ్యాన్స్. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని ఓ థియేటర్‌ ముందు నాని భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. 63 అడుగులతో 'శ్యామ్‌ సింగరాయ్‌' పాత్రలో ఉన్న నాని కటౌట్‌ను దాని మెడలో పూల దండలు వేసి రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని. ఇక శ్యామ్ సింగరాయ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రాన్ని హారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర మీద వెంకట్ బోయనపల్లి నిర్మించగా.. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. 1970లలో కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కెరీర్‌లో తొలిసారి నాని తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ తన సినిమాను ఒకేసారి విడుద‌ల చేస్తుండం విశేషం. నాని సరసన సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్ , కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్, పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న శ్యామ్ సింగరాయ్ ఎలాంటి వినోదాన్ని అందిస్తాడో వేచిచూడాలి.

More News

కరోనా నుంచి కోవిషీల్డ్ రక్షణ ‘‘మూడు’’ నెలలే..  బ్రిటన్ శాస్త్రవేత్తల సంచలన నివేదిక

దక్షిణాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి తెలిసిందే.

ఖరీదైన విడాకులు.. భరణంగా రూ.5,555  కోట్లు చెల్లించండి, దుబాయ్ రాజుకు కోర్ట్ ఆదేశం

ఏదైనా కారణం చేత భర్త.. భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటే ఆమె జీవితం సాఫీగా సాగేందుకు భరణం కూడా చెల్లించాలి.

బిగ్‌బాస్ 5 విజేత సన్నీకి కరెంట్ షాక్.. ప్రె‌స్‌మీట్‌లో వుండగానే ఘటన, వీడియో వైరల్

హోరాహోరీగా జరిగిన బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్‌ విజేతగా వీజే సన్నీ గెలుపొందిన సంగతి తెలిసిందే.

వి.వి వినాయక్ చేతుల మీదుగా విడుదలైన  వెంప కాశీ 'పంచనామ' ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్

వెంప కాశీ గారు పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ క్రియేషన్ చిత్ర యూనిట్ మాస్ డైరెక్టర్  వి.వి వినాయక్ గారు

వీకెండ్ బాక్సాఫీస్ రిపోర్ట్ : ఫుల్ స్వింగ్‌లో పుష్ప.. తెలంగాణలో సరికొత్త రికార్డ్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా అంచనాలను మించి అదరగొడుతోంది.