దిశ సినిమాపై కోర్టులో పిటిషన్... స్పందించిన నట్టికుమార్
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'దిశా ఎన్కౌంటర్'. గత ఏడాది నవంబర్ 26న దిశపై జరిగిన అత్యాచారం, హత్య... ఆ తర్వాత దోషులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం అంశాలతో ఆర్జీవీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఓ విచారణ కమిటీ విచారణ చేస్తుంది. ఈ తరుణంలో ఈ సినిమా తీయడం సరికాదంటూ, కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకుని సినిమా ఆపాలంటూ దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో అసిస్టెంట్ సొలిసిటేటర్ స్పందిస్తూ పిటిషనర్ సినిమాను ఆపాలంటూ సెన్సార్ బోర్డుకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. అయితే హైకోర్టు ఈ వ్యవహారంపై స్పందించిన హైకోర్టు కేంద్రం, సెన్సార్ బోర్డు సమస్యపై స్పందించాలని కోరింది.
ఈ వ్యవహారంపై చిత్ర నిర్మాత నట్టికుమార్ స్పందించారు. "దిశ ఎన్కౌంటర్ చేయడం వల్ల అత్యాచారాలు ఆగలేదు. ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. చట్టాల్లో మార్పు జరగాలని ఉద్దేశంతో మేం సినిమా చేస్తున్నాం. మేం బయోపిక్ తీయలేదు. ఓ ఘటనను ఆధారంగా చేసుకుని మేం తీస్తున్న సినిమా. దిశ తల్లిదండ్రులను మేం కించపరచాలని అనుకోలేదు. సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని మేం పాటిస్తాం. ఎవైనా సన్నివేశాలను తొలగించమంటే కూడా తొలగిస్తాం. నవంబర్ 26న సినిమా చూసిన తర్వాత ఏం చెప్పామనే సంగతి చూసి మాట్లాడవచ్చు. ట్రైలర్ విడుదల చేశాం. అందులో మేం ఎక్కడా అసభ్యంగా చూపించలేదు" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout