దిశ సినిమాపై కోర్టులో పిటిషన్‌... స్పందించిన నట్టికుమార్‌

  • IndiaGlitz, [Saturday,October 10 2020]

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'దిశా ఎన్‌కౌంటర్‌'. గత ఏడాది నవంబర్‌ 26న దిశపై జరిగిన అత్యాచారం, హత్య... ఆ తర్వాత దోషులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం అంశాలతో ఆర్జీవీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఓ విచారణ కమిటీ విచారణ చేస్తుంది. ఈ తరుణంలో ఈ సినిమా తీయడం సరికాదంటూ, కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకుని సినిమా ఆపాలంటూ దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో అసిస్టెంట్‌ సొలిసిటేటర్‌ స్పందిస్తూ పిటిషనర్‌ సినిమాను ఆపాలంటూ సెన్సార్‌ బోర్డుకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. అయితే హైకోర్టు ఈ వ్యవహారంపై స్పందించిన హైకోర్టు కేంద్రం, సెన్సార్‌ బోర్డు సమస్యపై స్పందించాలని కోరింది.

ఈ వ్యవహారంపై చిత్ర నిర్మాత నట్టికుమార్‌ స్పందించారు. దిశ ఎన్‌కౌంటర్‌ చేయడం వల్ల అత్యాచారాలు ఆగలేదు. ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. చట్టాల్లో మార్పు జరగాలని ఉద్దేశంతో మేం సినిమా చేస్తున్నాం. మేం బయోపిక్‌ తీయలేదు. ఓ ఘటనను ఆధారంగా చేసుకుని మేం తీస్తున్న సినిమా. దిశ తల్లిదండ్రులను మేం కించపరచాలని అనుకోలేదు. సెన్సార్‌ బోర్డు నిర్ణయాన్ని మేం పాటిస్తాం. ఎవైనా సన్నివేశాలను తొలగించమంటే కూడా తొలగిస్తాం. నవంబర్‌ 26న సినిమా చూసిన తర్వాత ఏం చెప్పామనే సంగతి చూసి మాట్లాడవచ్చు. ట్రైలర్‌ విడుదల చేశాం. అందులో మేం ఎక్కడా అసభ్యంగా చూపించలేదు అన్నారు.

More News

విశాల్‌కు మద్రాస్‌ హైకోర్ట్‌ షాక్‌

హీరో, నిర్మాత విశాల్‌కు మద్రాస్‌ హైకోర్ట్‌ శుక్రవారం పెద్ద షాకే ఇచ్చింది. వివరాల్లోకెళ్తే... విశాల్‌, సుందర్‌.సి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'యాక్షన్‌'.ఈ సినిమా విడుదల సమయంలో

సూసైడ్ చేసుకోవాలనుకున్నానన్న అవినాష్.. మోనాల్‌పై నమ్మకం లేదన్న అఖిల్

ఇవాళ షో మొత్తాన్ని అవినాష్ కంప్లీట్‌గా హ్యాండోవర్ చేసుకున్నాడు. ఎక్కువ స్క్రీన్ స్పేస్ అవినాష్‌కే దక్కింది. చూసే వాళ్లకే కాదు.. కంటెస్టెంట్లలో కూడా మంచి జోష్‌ని నింపాడు. ఇక షో విషయానికి వస్తే..

అన్‌లాక్ 5.0 నిబంధనలను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

కేంద్రం జారీ చేసిన అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.

రాఘవేంద్రుడి 'పెళ్లి సందడి' మళ్లీ మొదలు కాబోతోంది

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అద్భుత సృష్టి ‘పెళ్లి సందడి’ గుర్తుంది కదా.. 1996లో శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.

అల్లు అర్జున్, రానాలు నా ప్రయాణాన్ని అద్భుతం చేశారు: అనుష్క

లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో అనుష్క దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 'అరుంధతి'తో మొదలైన అనుష్క లేడీ ఓరియంటెడ్ మూవీస్ ప్రయాణం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.