'సైకో వర్మ - వీడు తేడా' మోషన్ పోస్టర్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,August 10 2021]

'సైకో వర్మ' (వీడు తేడా) చిత్రం మోషన్ పోస్టర్ ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైంది. విడుదలైన కొద్ది గంటల్లోనే దీనికి విశేషమైన స్పందన లభించింది. నట్టిక్రాంతి హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్లుగా సుపూర్ణ మలాకర్, ముస్కాన్ సందడి చేస్తున్నారు. నట్టికుమార్ దర్శకత్వం వహించారు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి నట్టి లక్ష్మి, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో అనురాగ్ కంచర్ల నిర్మాణంలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు.

ఈ సందర్భంగా.....

నిర్మాత నట్టి కరుణ మాట్లాడుతూ, ఓ సాఫ్ట్ వేర్ కుర్రాడి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతూ...యదార్థ సంఘటనల ప్రేరణతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంటుందని అన్నారు. హీరో నట్టి క్రాంతి తన పాత్రకు ప్రాణం పోశాడని, పాటలు కూడా అలరిస్తాయని చెప్పారు. చిత్రం అన్నివిధాలుగా చాలాబాగా వచ్చిందని, సెప్టెంబర్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నామని అన్నారు.

ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో చమక్ చంద్ర, కేదార్ శంకర్ తదితరులు తారాగణం.

ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్, సినిమాటోగ్రఫీ: జనార్దన్ నాయుడు, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: కె.వి.రమణ, ఫైట్స్: వింగ్ చున్ అంజి, పి.ఆర్.వో: శ్రీరామ్, నిర్మాత: నట్టి కరుణ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నట్టికుమార్.

More News

అర్జున్ రెడ్డి దర్శకుడి తో వైష్ణ‌వ్ తేజ్ పంజా కేతికా శ‌ర్మ షూటింగ్ ప్రారంభం

2021లో ‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సెన్సేషనల్ స్టార్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా

స్క్రిప్టు నచ్చితేనే సినిమా ఒప్పుకుంటా - ప్రియాంక జవాల్కర్

టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్. ఇటీవల స్పీడ్ పెంచిన ఈ నాయిక తిమ్మరుసు,

ఆసక్తిని రేకెత్తిస్తున్న మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ SSMB28 చిత్రం వివరాలు

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మరో చిత్రం

శ‌రణ్ కుమార్ కొత్త చిత్రం.. హీరో లుక్‌ పోస్టర్‌ను ఆవిష్క‌రించిన సూప‌ర్‌స్టార్ కృష్ణ

సూపర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మల ఫ్యామిలీ నుంచి శ‌రణ్ కుమార్ హీరోగా ప‌రిచయం అవుతున్న సినిమాలో హీరో లుక్ పోస్ట‌ర్‌ను ఆదివారం సూప‌ర్‌స్టార్ కృష్ణ విడుద‌ల చేశారు.

'SR కళ్యాణమండపం' మ్యూజికల్ హిట్ అవడం సంతోషంగా ఉంది - చేతన్ భరద్వాజ్

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ ఆ పేరు వినగానే "RX 100" చిత్రం లోని పిల్లారా సాంగ్ గుర్తుకు వస్తుంది.