జనసేనను పట్టించుకోని జాతీయ మీడియా సర్వేలు!

  • IndiaGlitz, [Sunday,January 27 2019]

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేషనల్ మీడియా రాష్ట్రంలో వచ్చి వాలిపోయి సర్వే చేయడం మొదలెట్టేసింది. ఇప్పటికే పలు సర్వే సంస్థలు ఫలానా పార్టీకి ఇన్ని సీట్లొస్తాయని తేల్చేయగా.. మరికొన్ని ఇంకా తేల్చా్ల్సి ఉంది. అయితే ఎంతసేపూ ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ ఇన్ని సీట్లొస్తాయని లెక్కలు చెబుతున్నారే తప్ప.. ఏ ఒక్క సంస్థా జనసేనను పట్టించుకున్న జాడల్లేవ్. అసలు జాతీయ సర్వే సంస్థల సర్వేల్లో జనసేన గురించి ఏం తేలింది..? ఎందుకు పవన్ పార్టీపై సర్వేలు ఏమీ తేల్చలేకపోతున్నాయనేది తెలియరాలేదు.

ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చిన పవన్ కల్యాణ్.. ఈ సారి కచ్చితంగా ఒంటరిగా బరిలోకి దిగుతానని చెప్పుకుంటున్నారు. అంతేకాదు సీఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్ ఇద్దరూ సీఎంలు కాలేరని.. కన్నడనాట మాదిరిగా తాను కూడా ఏపీ కుమారస్వామిని అవుతానని పెద్ద పెద్ద డైలాగ్‌‌లే రియల్‌‌లైఫ్‌లో ఆయన వదులుతున్నారు. కోస్తా ఆంధ్రలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా్లో సామాజిక వర్గమే పవన్‌కు ఎక్కువ సీట్లు తెచ్చిపెడుతుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నా ఇంత వరకూ ఏ సర్వేలోనూ జనసేన గురించి చెప్పకపోవడం గమనార్హం.

కాగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను వైసీపీకి 19 సీట్లు, టీడీపీకి కేవలం 6 సీట్లు మాత్రమే వస్తాయని రిపబ్లిక్‌ టీవీ-సీ ఓటర్‌ సంస్థలు తేల్చిన సంగతి తెలిసిందే. ఓట్ల శాతం పరంగా చూసినా వైసీపీకి 41.3 శాతం ఓట్లు.. టీడీపీకి 33.1 శాతం ఓట్లు పడతాయని సర్వేలో తేలింది. అయితే ఎక్కడే గానీ జనసేన ప్రభావం ఉంటుందని మాత్రం ఏ మీడియాను తేల్చలేదు. అయితే జనసైన్యం మాత్రం మిగిలిన 25.6 శాతం మాదేనని చెప్పుకుంటున్నారు.

అసలు ఈ ఎన్నికల్లో అయినా పవన్ ఒంటరిగా పోరాటం చేస్తారా..? లేకుంటే మళ్లీ టీడీపీ లేదా జగన్ పార్టీ జై కొడతారా..? ఎంతో నమ్మకంతో పార్టీలోకి వచ్చిన ఇద్దరు సిట్టింగ్‌లతో పాటు.. పలువురి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా..? అనేది తెలియాలంటే మరో నెలరోజుల పాటు వేచి చూడాల్సిందే మరి.

More News

పవన్‌‌తో కేసీఆర్, కేటీఆర్ భేటీ.. మధ్యలో జగన్!?

రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్‌భవన్‌‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో జనసేన అధినేత పవన్‌‌ కల్యాణ్‌తో సీఎం కేసీఆర్,

పవన్ కోసం.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి 'అన్నయ్య'!

అవును.. మీరు వింటున్నది నిజమే.. ఇన్నాళ్లు కామెడీ షోలు, యూ ట్యూబ్‌‌కే పరిమితమైన నాగబాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు.

బాబాయ్‌కు ప్రేమతో.. ‘ఒక్కడొచ్చాడు’!

ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకూ ఓ లెక్క..

కడప జిల్లాలో వైసీపీకి షాక్.. టికెట్ ఇవ్వలేదని రాజీనామా!

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతల జంపింగ్‌లు షురూ అయ్యాయి. ఎప్పట్నుంచో పార్టీ కోసం పనిచేస్తూ టికెట్లు ఆశించిన నేతలకు అధినేతలు షాకివ్వడంతో

వరుణ్‌తేజ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ భారీ చిత్రం 'వాల్మీకి' ప్రారంభం

ఫిదా', 'తొలిప్రేమ', 'అంతరిక్షం', 'ఎఫ్‌2' వంటి విభిన్న చిత్రాలతో ఘనవిజయాలు అందుకున్న మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా