ఏనుగుకు నేషనల్ లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్.. పేరు సింగమలం..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏనుగుకు నేషనల్ లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటా? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే. దానికున్న హెయిర్ స్టైల్ అలాంటిది మరి. దాని హెయిర్ స్టైల్‌ని ఇష్టపడని వారంటూ లేరు. దాని పేరు సింగమలం. తమిళనాడులోని మన్నార్‌గుడి పట్టణంలో రాజగోపాల స్వామి అధికారులు 2003లో కేరళ నుంచి దీనిని తీసుకొచ్చారు. దీనికోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. దీని హెయిర్ స్టైల్ చూసిన వారంతా ఫిదా అయిపోతున్నారు. క్రమక్రమంగా సింగమలానికి దేశ వ్యాప్త ఫాలోయింగ్ వచ్చేసింది.
సాధారణంగా ఏనుగుల తలపై జుట్టుండదు. దీనికి మాత్రం మనుషులకు మల్లే జుట్టుంటుంది. అంతేకాదు... దీని హెయిర్ స్టైల్ కోసం దేవస్థానం ప్రత్యేకంగా కొందరు సిబ్బందిని నియమించింది. వీరు ఈ గజరాజానికి రోజుకు రెండు సార్లు స్నాయించి చక్కగా తల దువ్వుతారు. గతంలో ఒకసారి సింగమలం ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి నెటిజన్లు దీనిని అనుసరిస్తున్నారు. తాజాగా ఈ గజరాజం ఫోటోలను సుధా రామన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి ట్విటర్‌లో పోస్టు చేయడంతో మరోసారి ఇది వైరల్ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com