Trisha:త్రిష గురించి మన్సూర్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం

  • IndiaGlitz, [Monday,November 20 2023]

హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Mansoor Ali Khan) చేసిన వ్యాఖ్యలు దేశవ్యా్ప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు ఖండించగా.. తాజాగా జాతీయ మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ‘‘త్రిష కృష్ణన్‌ను ఉద్దేశించి మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. అతడిపై IPC సెక్షన్ 509 Bతో పాటు ఇతర సంబంధిత సెక్షన్లపై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. మహిళలపై హింసను ప్రేరేపించే ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదు’’ అని ట్వీట్‌ చేసింది.

మన్సూర్ వ్యాఖ్యలపై సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా స్పందిస్తున్నారు. తాజాగా మాజీ హీరోయిన్, ఏపీ మంత్రి ఆర్కే రోజా కూడా స్పందించారు. ఇలాంటి వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదని అభిప్రాయపడ్డారు. నాపై దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే త్రిష, ఖుష్బూ, నాపై వ్యాఖ్యలు చేసిన మన్సూర్ అలీ ఖాన్ లాంటి వాళ్లు కావచ్చు. కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోని పక్షంలో ఈ మగాళ్లు ఇలాగే భయపడకుండా నోటికి వచ్చినట్లు ఏదైనా మాట్లాడతారు. ఆడవారిని ఈ విధంగా టార్గెట్ చేసినా.. రాజకీయాలు, సినిమాల్లో ఎదిగి చూపించాం. ఇలాంటి మగాళ్లను ఇతర మహిళలు కలిస్తే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ అని ట్వీట్ చేశారు.

తెలుగు హీరో నితిన్ కూడా స్పందిస్తూ సమాజంలో మనువాదానికి చోటులేకుండా పోతుంది. త్రిష గురించి మన్సూర్ అలీఖాన్ చేసిన నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. సినీ ఇండస్ట్రీలో మహిళలపై ఇలాంటి నీచమైన కామెంట్స్ చేయడం సరికాదు. దీనికి వ్యతిరేకంగా ప్రతిఒక్కరు నిలబడాలని కోరుతున్నా అని ట్వీట్ చేశారు. సింగర్ చిన్మయి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి వారికి సినిమాల్లో ఎందుకు అవకాశాలిస్తున్నారంటూ మండిపడ్డారు.

అసలు ఏం జరిగిందంటే..?

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ అలీ ఖాన్ ‘లియో’లో త్రిషతో ఓ సీన్‌ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో ఎన్నో చిత్రాల్లో నేను రేప్‌ సీన్లలో నటించా. లియోలో ఆఫర్‌ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్‌ ఉంటుందని అనుకున్నా. కాకపోతే ఆ సీన్‌ లేకపోవడం బాధగా అనిపించింది’’ అని మన్సూర్‌ అలీఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతడి వ్యాఖ్యలను త్రిష ఖండిస్తూ ఇలాంటి వారి వల్లే మానవాళికి చెడ్డపేరు వస్తుందని.. అతడితో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకోనందుకు ఆనందంగా ఉందని తెలిపారు.

More News

Kodali Nani:నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. టీడీపీకి కొడాలి నాని ఛాలెంజ్..

గుడివాడ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ పకోడీగాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని

CP Sandeep Shandilya:హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు గుండెపోటు

హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్ పాత సీపీ కార్యాలయంలో

CM KCR:టీడీపీని ఎన్టీఆర్ అందుకే స్థాపించారు: సీఎం కేసీఆర్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలతో దూసుకుపోతున్నారు.

Chandrababu:చంద్రబాబుకు భారీ ఊరట.. స్కిల్ కేసులో బెయిల్ మంజూరు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆయనకు పూర్తి స్థాయి బెయిల్‌ మంజూరు చేస్తూ

Greater Hyderabad:ఒంటిరిగా గ్రేటర్ హైదరాబాద్ అభ్యర్థులు.. కీలక నేతల కోసం ఎదురుచూపులు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం తుది దశకు చేరింది. అన్ని పార్టీల నేతలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.