Allu Arjun:అభిమానులకు బిగ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చిన బన్నీ.. 'పుష్ప 2' లొకేషన్ పంచుకున్న ఐకాన్ స్టార్

  • IndiaGlitz, [Wednesday,August 30 2023]

జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు అభిమానులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. తాజా బన్నీ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన దినచర్య ఎలా ప్రారంభమవుతుందో చెబుతూ.. పుష్ప 2 మేకింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప 2 షూటింగ్ అత్యంత వేగంగా జరుగుతోంది. ఇందుకోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో సెట్స్ వేశారు. వీటిని అల్లు అర్జున్ తన అభిమానులతో పంచుకున్నారు.

నా అభిమానులు గర్వపడేలా వుంటా:

‘‘ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాలతో పోలిస్తే భారతదేశంలో అభిమానులు చాలా భిన్నంగా వుంటారు. వాళ్ల ప్రేమను, అభిమానాన్ని వివరించడం చాలా కష్టం అన్నారు. పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న సమయంలో తనను కలిసేందుకు అభిమానులు వచ్చారని.. తనను చూసి వారు గర్వపడేలా వుంటానని అల్లు అర్జున్ తెలిపారు. పుష్పలో తనకు పుష్పరాజ్ పాత్ర అంటే చాలా ఇష్టమని.. ఎందుకంటే అతను దేనికీ వెనుకంజ వేయడని బన్నీ చెప్పారు. ఇదే వీడియోలో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. పుష్ప 2 తనకెంతో స్పెషల్ అన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌తో జతకట్టిన తొలి ఇండియన్ స్టార్ :

ఇదిలావుండగా.. ఇప్పటికే తన పేరిట ఎన్నో రికార్డులు నమోదు చేసిన అల్లు అర్జున్ మరో ఘనతను అందుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌తో కొలాబరేట్ అయిన తొలి భారతీయ నటుడిగా ఆయన రికార్డుల్లోకెక్కారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇప్పటి వరకు ఏ ఇండియన్ స్టార్‌కు ఈ రికార్డు దక్కలేదు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ బృందం హైదరాబాద్‌కు వచ్చి ఆయనకు సంబంధించిన కొన్ని వీడియోలను చిత్రీకరించింది. ఒక రోజంతా అల్లు అర్జున్ ఇంట్లోనే గడిపింది. ఈయన దినచర్య ఎలా ప్రారంభమవుతుందన్న దానిని చిత్రీకరించింది. ఆ వీడియోను బన్నీ ఇన్‌స్టా‌లో షేర్ చేశారు.

More News

Ntr100 Rupees:ఎన్టీఆర్ రూ.100 నాణెం కోసం ఫ్యాన్స్ క్యూ.. వేల కాయిన్స్ సేల్, మరిన్ని ముద్రించే పనిలో సర్కార్

టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన సంస్మరణార్ధం రూ.100 నాణెం ముద్రించిన సంగతి తెలిసిందే.

Gas:దేశ ప్రజలకు ‘‘రక్షాబంధన్ ’’ కానుక.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు, కేంద్రం ప్రకటన

పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం రక్షా బంధన్ కానుక ఇచ్చింది. ఇంటి అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్‌పై రూ.200 చొప్పున తగ్గించింది.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే.. జనసేన వినూత్నం, ఐదు సేవా కార్యక్రమాలకు పిలుపు

జనసేన అధినేత , సినీనటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజంటే అభిమానులకు పండుగ రోజు. పవన్ అన్న పేరే ప్రభంజనం,

Family Dhamaka:ఫ్యామిలీ ధమాకా.. ఇది దాస్ కా ఇలాఖా : విశ్వక్‌సేన్ హోస్ట్‌‌గా ఆహాలో రియాలిటీ షో, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ బాగా విస్తరిస్తోంది. సీనియర్ హీరో హీరోయిన్లు , నటుడు, ప్రతిభావంతులకు ఈ పరిశ్రమ అవకాశాలు కల్పిస్తోంది.

Phone ban: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం .. స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం

సమాచార మార్పిడి కోసం అందుబాటులోకి వచ్చిన సెల్‌ఫోన్ ప్రస్తుతం మనిషి నిత్య జీవితంలో భాగమైన సంగతి తెలిసిందే.