Natho Nenu Review: ‘నాతో నేను’ మూవీ రివ్యూ

  • IndiaGlitz, [Sunday,July 23 2023]

దాదాపు దశాబ్ధ కాలంగా తెలుగువారికి నవ్విస్తున్న జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కళాకారులు పరిచయమయ్యారు. ఈ ఫ్లాట్ ఫామ్ ద్వారా తమ ప్రతిభను చాటుకుని ఇప్పుడు హీరోలుగా, కమెడియన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా, స్క్రిప్ట్ రైటర్లుగా , దర్శకులుగానూ బిజీ అయ్యారు. జబర్దస్త్‌ ద్వారా ప్రేక్షకులకు నవ్వులు పంచిన వేణు.. బలగంతో దర్శకుడిగా మారి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో డిమాండ్ వున్న డైరెక్టర్‌గా మారారు. ఇప్పుడు అదే జబర్దస్త్ నుంచి మరొకరు మెగా ఫోన్ పట్టుకున్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ , నటుడు శాంతి కుమార్ తుర్లపాటి అలియాస్ జబర్దస్త్ శాంతి కుమార్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘‘నాతో నేను’’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా వుందో చూస్తే.

కథ :

కోటిగాడు అలియాస్ కోటేశ్వరరావు (శ్రీనివాస సాయి) అనే కుర్రాడు.. ఆ వయసులో దీప (జబర్దస్త్ ఐశ్వర్య) అనే అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. అన్ని ప్రేమకథల్లో మాదిరిగానే వీరి పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు నిరాకరిస్తారు. మరోవైపు కోటిగాడు (ఆదిత్య ఓం)కి వయసు మీద పడుతుంది. ఆ సమయంలో నాగలక్ష్మీ (దీపాలి రాజ్‌పుత్)ని చూసి ప్రేమలో పడతాడు. వీరి ప్రేమ కథ ఏమైంది. కోటేశ్వరరావు (సాయి కుమార్) షష్టీ పూర్తి సమయానికి బాగా డబ్బులు సంపాదించడమే కాకుండా వూళ్లో పెద్ద మనిషిగానూ , మంచి మనిషిగానూ పేరు తెచ్చుకుంటాడు. అతని జీవితంలో ఏం జరిగింది.? డబ్బుకు ఏ లోటు లేని అతను సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకుంటాడు..? ఆ సమయంలో కోటేశ్వరరావుకు స్వామిజీ ఇచ్చిన వరం ఏంటి..? తనకు లభించిన శక్తి సాయంతో కోటేశ్వరరావు ఏం చేశాడు ..? చివరికి పైన చెప్పిన ప్రేమకథలు ఏమయ్యాయి అనేదే ‘‘నాతో నేను’’ సినిమా.

విశ్లేషణ :

ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఎదుర్కొనే మూడు దశలను స్పృశిస్తూ శాంతి కుమార్ కథ రాసుకున్నాడు. డబ్బు మనిషి జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుంది.. అది మనిషికి ఎంతవరకు అవసరం వంటి విషయాలపై తనదైన యాంగిల్‌లో ఫిలాసఫి చెప్పారు శాంతికుమార్. తను చెప్పాలనుకున్న విషయాన్ని డైలాగ్ కింగ్ సాయికుమార్ చేత సూటిగా సుత్తి లేకుండా చెప్పించారు. అయితే ఇంత మంచి కథను రాసుకుని.. దానిని స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడంలో శాంతికుమార్ కాస్త కన్‌ఫ్యూజ్ అయ్యారు. కథకుడిగా ఓకే అనిపించుకున్న ఆయన డైరెక్టర్‌గా మాత్రం తన అనుభవలేమి మాత్రం స్క్రీన్‌పై కొట్టొచ్చినట్లు కనిపించింది.

శంకర్ మాదిరిగా సామాజిక సందేశానికి కమర్షియల్ హంగులు జోడించాలనే ప్రయత్నం బెడిసికొట్టింది. ఇవి పంటికింద రాయిలా అడ్డుపడి స్టోరీ ఫ్లోను దెబ్బతీశాయి. కామెడీ ట్రాక్ బాగానే సెట్ అయినప్పటికీ.. ఇది కూడా అక్కడక్కడ కథకు అడ్డు తగిలింది. సత్యకశ్యప్ మ్యూజిక్ బాగానే వుంది. పాటలు బాగానే వెళ్లిపోయాయి. ఇలాంటి సినిమాలకు సినిమాటోగ్రఫీ, సాంగ్స్ విషయంలో ఇంకాస్త దృష్టి పెడితే సినిమా తిరుగులేకుండాపోయేది. శాంతి కుమార్ ఈ విషయంలో అంతగా కాన్సన్‌ట్రేషన్ చేయలేదు. అయితే నిర్మాతలు మాత్రం ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తీసినట్లు విజువల్స్ చూస్తే కనిపిస్తుంది.

నటీనటుల పనితీరు :

సాయికుమార్ వయసుకు తగ్గ పాత్రలో ఒదిగిపోయారు. తనను అందరూ డైలాగ్ కింగ్ అని ఎందుకు అంటారో సాయి మరోసారి రుజువు చేశారు. సందర్భానుసారంగా ఆయన పలికే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. సినిమాకు సాయి కుమారే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టించారు. శ్రీనివాస సాయి, జబర్దస్త్ ఐశ్వర్య మధ్య కెమిస్ట్రీ బాగుంది. లవ్ ఫెయిల్యూర్ సీన్‌లో సాయి బాగా చేశాడు. చానాళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆదిత్య ఓం కూడా తన వయసుకు తగ్గ పాత్రతో మెప్పించారు. ఓ మిల్లులో పని చేస్తూనే తను ఇష్డపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుని మోసపోయిన పాత్రలో ఆదిత్య ఓం నటన అమేజింగ్‌. దీపాల్ రాజ్‌పుత్ అందాలు ఆకట్టుకుంటాయి. రాజీవ్ కనకాల, విజయ్ చందర్ , గౌతం రాజులు తమ పరిధి మేరకు పాత్రలకు న్యాయం చేశారు. అయితే వాళ్ల పాత్రలను ఇంకాస్త పెంచి ఉంటే ఫుల్‌ఫిల్‌ వుండేది. ఓవరాల్‌గా అయితే చక్కని సందేశంతోపాటు వినోదాన్ని పంచారు.

ఫైనల్ టచ్ : చేసిన మంచి ఎక్కడికీ పోదనే విషయాన్ని చక్కగా చెప్పారు. డబ్బు మాత్రమే ముఖ్యమని భావించి దానితోనే జీవితం ఉందనుకుంటే చివరికి ఏమీ మిగలదు అనే చక్కని సందేశం ఇచ్చారు.

నటీనటులు : సాయికుమార్‌, ఆదిత్యా ఓం, శ్రీనివాస్‌ సాయి, ఐశ్వర్య, దీపాలి రాజ్‌పుత్‌, రాజీవ్‌ కనకాల, సమీర్‌, సివిఎల్‌ నరసింహరావు, గౌతంరాజు, భద్రమ్‌, సుమన్‌శెట్టి తదితరులు.
సినిమాటోగ్రఫీ : ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి
సంగీతం: సత్య కశ్యప్‌
బ్యాగ్రౌండ్‌ స్కోర్‌: ఎస్‌ చిన్నా
ఎడిటింగ్‌: నందమూరి హరి
ఆర్ట్‌: పెద్దిరాజు అడ్డాల
బ్యానర్‌: శ్రీభవ్నేష్‌ ప్రొడక్షన్స్‌
సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి
నిర్మాత: ప్రశాంత్‌ టంగుటూరి
దర్శకత్వం: శాంతికుమార్‌ తూర్లపాటి

రివ్యూ రేటింగ్: 2.5

More News

Pawan Kalyan :మైడియర్ వాట్సన్ .. ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పు , జగన్ టార్గెట్‌గా వాలంటీర్లపై పవన్ మరో ట్వీట్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

YS Jagan:జగన్ నాలుగేళ్ల కష్టానికి ప్రతిఫలం.. ఏపీలో తగ్గుతోన్న పేదరికం, నీతి ఆయోగ్ ప్రశంసలు

భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంతిమ ధ్యేయం పేదరికాన్ని రూపుమాపడమే. ఇందుకోసం ఎన్నో విధాన నిర్ణయాలు,

Kanguva:యోధుడిగా డిఫరెంట్ లుక్‌లో సూర్య..  ‘‘కంగువా’’ గ్లింప్స్‌ చూశారా, అర్ధరాత్రి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్

వైవిధ్యమైన కథలకు ప్రాధాన్యతనిస్తారు తమిళ స్టార్ హీరో సూర్య. హిట్టు ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేసుకుంటూ వెళ్తారు.

YS Jagan:నా వాలంటీర్లనే అంటారా.. జగన్ ఎదురుదాడికి బిత్తరపోయిన ప్యాకేజ్ స్టార్లు, పెయిడ్ గ్యాంగ్‌

ఏదో సినిమాలో ‘‘నేను దిగనంత వరకే’’ అన్న డైలాగ్ ఫుల్ ఫేమస్. తన విశ్వరూపం చూపిస్తే ఎలా వుంటుందో

Samantha:సినిమాలకు బ్రేక్.. అయినా తగ్గని క్రేజ్, మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ జాబితాలో సమంతదే అగ్రస్థానం

చిత్ర పరిశ్రమ విచిత్రమైంది. మహాసముద్రం లాంటి ఇక్కడ నిలదొక్కుకోవడం అంత ఆషామాషీ కాదు.