'నాటకం' మూవీ సక్సెస్ మీట్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ హీరో హీరోయిన్లుగా విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న చిత్రం 'నాటకం'.. కళ్యాణ్ జి గోగన దర్శకుడు. సాయి కార్తీక్ సంగీతం అందించగా గరుడవేగతో మంచి పేరు తెచ్చుకున్న అంజి సినిమాటోగ్రఫీ ని అందించారు.. కాగా ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా సినిమా సక్సెస్ మీట్ ను ఈ రోజు ఎంతో అంగరంగవైభవంగా జరిపారు.. ఈ కార్యక్రమానికి సినిమా టీం అందరు రాగ, సినిమా హిట్ పై తమ ఆనందాన్ని వెల్లడించారు..
ఈ సందర్భంగా నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.. నమ్మి సినిమా ని కొన్నందుకు అది మీరు ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాల థాంక్స్.. మా బ్యానర్ లో ఫస్ట్ ఫిలిం ఇంత పెద్ద హిట్ అవడం చాల హ్యాపీ గా ఉంది.. ఈ ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేస్తానని చెప్తున్నాను.. అందరు కష్టపడి చేసిన సినిమా ఇది.. చిన్న సినిమా, అదీ అందరు కొత్త ఆర్టిస్టులతో వచ్చిన సినిమా ఇలాంటి సినిమా హిట్ చేసినందుకు చాల చాల థాంక్స్ అన్నారు..
హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ.. అందరు ఫోన్ చేసి సినిమా చాల బాగుందని అంటున్నారు. ఇక్కడే కాదు యూకే నుంచి కూడా మంచి టాక్ వస్తుంది. సినిమా నిన్న రిలీజ్ కాగానే మంచి రెస్పాన్స్ వచ్చింది.. చాల హ్యాపీ గా ఉంది. వేరే ప్లేసెస్ లో సినిమా రిలీజ్ చేయాలనీ కోరుతున్నారు.. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన అందరికి ధన్యవాదాలు అన్నారు..
మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ.. చిన్న సినిమాలను మళ్ళీ మళ్ళీ ఆదరిస్తారని మరోసారి రుజువైంది. రివ్యూస్ కూడా చాల బాగా వచ్చాయి.. మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా వారికి చాల థాంక్స్..ఈ సినిమా కి మెయిన్ మౌత్ టాకే పబ్లిసిటీ.. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ఈ సినిమా కి పనిచేసిన అందరికోసం ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com