నసీరుద్దీన్ షా విచారం...

  • IndiaGlitz, [Friday,December 21 2018]

బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ సమాజంలో ప్రస్తుత పరిస్థితుల పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల క్రితం బులంద్ షహర్‌లో ఇద్దరు పోలీసు అధికారులపై దాడి చేసి చంపేశారు.

దీని గురించి ఆయన మాట్లాడుతూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారికి రక్షణ లభిస్తుంది. పోలీస్ అధికారుల మరణం కంటే అవు చావు గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ప్రాముఖ్యత కూడా దానికే ఎక్కువగా ఉంది. ఇలాంటి సమాజంలో పిల్లల పరిస్థితేంటా! అనే ఆందోళనగా ఉంది అన్నారు నసీరుద్దీన్ షా.