అరుణ గ్రహంపై ఆక్సిజన్‌ను తయారు చేసిన పెర్సెవరెన్స్ రోవర్
Send us your feedback to audioarticles@vaarta.com
అంగారకుడిపైకి నాసా పంపిన రోవర్ ‘పెర్సెవరెన్స్’ మరో అద్భుతాన్ని సృష్టించింది. చరిత్రలోనే తొలిసారిగా మరో గ్రహంపై ఆక్సీజన్‌ను తయారు చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. గత ఏడాది 18న అంగారకుడిపై దిగిన పెర్సెవరెన్స్ అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది. అరుణ గ్రహంపై కార్బన్ డై ఆక్సైడ్‌ను సేకరించి మరీ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసినట్టు నాసా వెల్లడించింది. ఈ ఆరు చక్రాల రోవర్స్‌కు ముందు భాగం కుడివైపున కారు బ్యాటరీ పరిమాణంలో మెకానికల్ ట్రీగా పిలిచే పసిడి పెట్టె ఒకటి ఉంటుంది.
ఇది కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకుని.. విద్యుత్ రసాయనాల సాయంతో దానిని విడగొట్టి 5 గ్రాముల ఆక్సిజన్‌ను తయారు చేసింది. ఇది ఒక వ్యోమగామి పది నిమిషాల పాటు శ్వాసించడానికి ఇది సరిపోతుంది. గంటకు 10 గ్రాముల మేర ఆక్సిజన్ తయారు చేయాలనే లక్ష్యంతో ఇంజినీర్లు ఈ మెకానికల్ ట్రీని రూపొందించారు. ఈ దిశగా తొలి అడుగైతే పడింది. ఈ క్రమంలోనే రోవర్ 5 గ్రాముల ఆక్సిజన్‌ను తయారు చేసింది. కాగా.. ఇంజినీర్ల లక్ష్యం నెరవేరితే మాత్రం భవిష్యత్తులో అక్కడకు వెళ్లే వ్యోమగాములకు ఆక్సిజన్ కొరత ఉండదు. అలాగే భూమి నుంచి అంగారకుడిపైకి రాకెట్ ప్రొపెల్లంట్ తీసుకెళ్లాల్సిన అవసరమూ తప్పుతుందని నాసా స్పేస్ టెక్నాలజీ మిషన్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ జిమ్ రాయిటర్ వెల్లడించారు.
కాగా.. గత సోమవారం అక్కడి ఉపరితలంపై కాసేపు చక్కర్లు కొట్టిన పెర్సెవరెన్స్.. తాజాగా మరోసారి మరింత ఎత్తులో ఎక్కువ సమయం చక్కర్లు కొట్టింది. సోమవారం 3 మీటర్లు ఎత్తుకు ఎగిరిన రోవర్.. గురువారం 5 మీటర్ల ఎత్తుకు వెళ్లింది. ఇక గంతో పోలిస్తే ఈసారి 13 సెకన్లు ఎక్కువగా మొత్తం 52 సెకన్ల పాటు ప్రయాణించింది. దీనిపై ఇంజెన్యుటి చీఫ్ పైలట్ హవార్డ్ గ్రిప్ మాట్లాడుతూ.. హెలికాఫ్టర్‌ను ఎలా ప్రయోగించాలన్నది పరిశీలిస్తున్నామన్నారు. వాతావరణ పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. భూ వాతావరణంతో పోల్చితే అక్కడి వాతావరణం 1 శాతం మాత్రమేనన్నారు. అదే పెద్ద సవాలని.. దానిని అధిగమించి వచ్చే పరి రోజుల్లో మరో మూడు సార్లు హెలికాఫ్టర్‌ను ఎగిరేలా చేస్తామని హవార్డ్ గ్రిప్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments