ఇండియాలో నెం 2 - నరుడా డోనరుడా ట్రైలర్..!

  • IndiaGlitz, [Friday,September 30 2016]

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ న‌టించిన తాజా చిత్రం న‌రుడా డోన‌రుడా. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ను కింగ్ నాగార్జున రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ త‌న ఫ్రెండ్ సుమంత్ కోసం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ విశేషంగా ఆక‌ట్టుకోవ‌డంతో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఎలా ఉంటుందో అని ఆస‌క్తిగా ఎదురుచూసారు. అయితే... ఈ ట్రైల‌ర్ అంద‌రి అంచ‌నాల‌ను మించి ఊహించ‌ని విధంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.
ఫేస్ బుక్ & యూట్యూబ్ ఛాన‌ల్ లో కేవ‌లం 24 గంట‌ల్లోనే 1.8 మిలియ‌న్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.అలాగే యూట్యూబ్ లో ఎక్కువ మంది చూసిన వీడియోగా రికార్డ్ క్రియేట్ చేస్తూ ఇప్ప‌టికీ ఇండియా ట్రెండ్స్ లో రెండో స్ధానంలో నిల‌వ‌డం విశేషం. ఈ చిత్రంలో త‌నికెళ్ల భ‌ర‌ణి చెప్పిన‌ట్టుగా 100% స్ట్రైక్ రేట్ తో ఈ ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.ఇదే రియాక్ష‌న్ సినిమాకు కూడా వ‌స్తుంది అనిపిస్తుంది. మ‌రి...ట్రైల‌ర్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన న‌రుడా డోన‌రుడా మూవీ కూడా అంద‌ర్నీ ఆక‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంద‌ని ఆశిద్దాం..!

More News

రవితేజ ముహుర్తం ఫిక్సయ్యింది....

ఈ ఏడాది సినిమాలేవీ విడుదల చేయని మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు విక్రమ్ సిరి దర్శకత్వంలో నల్లమలుపుబుజ్జి నిర్మాతగా సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.

మనోజ్ టైటిల్....

గుంటూరు టాకీస్ అని ఊరు పేరుతో ప్రవీణ్ సత్తార్ చేసిన సినిమా మంచి టాక్ సాధించుకుంది.

ఎట్టకేలకు గోపీచంద్ సినిమా విడుదల సిద్ధమవుతుంది...

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో.

పవన్ నుంచి సంతోష్ శ్రీన్ వాస్ కి పిలుపు..!

కందిరీగ,రభస చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్ తెరకెక్కించిన తాజా చిత్రం హైపర్

బుల్లితెర పై రామ్ రికార్డ్..!

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ హీరోగా యువ ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించిన చిత్రం నేను శైల‌జ‌. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో నేను శైల‌జ చిత్రం ఘ‌న విజ‌యం సాధించి ఫెయిల్యూర్ లో ఉన్న రామ్ కి మంచి స‌క్సెస్ ని ఇచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం బుల్లితెర పై రికార్డ్ క్రియేట్ చేసింది.