ఈరోజు థియేటర్స్ లో నరుడా డోనరుడా..!
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం నరుడా డోనరుడా. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఆడియోన్స్ లో ఆసక్తిని పెంచింది. ఈ చిత్రాన్ని ఈరోజు (4న) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. అయితే....నరుడా డోనరుడా ఈరోజు రిలీజ్ కావడం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది.
అలాంటిది ఏమీ లేదు ఈరోజు మార్నింగ్ షో నుంచి నరుడా డోనరుడా చిత్రం అన్ని ఏరియాల్లో రిలీజ్ అవుతుంది అని నిర్మాత జాన్ సుధీర్ తెలియచేసారు. ఈ మూవీ రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనుకున్న ప్రకారం ఈరోజు మార్నింగ్ షోస్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. అందుచేత ఎలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మద్దు. దయచేసి మీ దగ్గరలో గల థియేటర్ లో నరుడా డోనరుడా చిత్రాన్ని చూడండి. ఇక ఈరోజు నుంచి ఈ చిత్రం ప్రేక్షకులది అని తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments