బ్రహ్మోత్సవం లో నరేష్ క్యారెక్టర్ ఇదే..
Wednesday, January 20, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ్ లో అత్యంత ప్రతిష్మాత్మకంగా ఈ చిత్రాన్ని పివిపి సంస్థ నిర్మిస్తుంది. ప్రస్తుతం బ్రహ్మోత్సవం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా నరేష్ మీడియాతో మాట్లాడుతూ...మహేష్ తో కలసి నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది బ్రహ్మోత్సవం సినిమా ద్వారా నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మహేష్ మేనమామ పాత్ర పోషిస్తున్నాను. మహేష్, నేను కలసి ఉన్న సన్నివేశాలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. బంధాలు..అనుబంధాల ప్రాధాన్యతను చాటిచెప్పేలా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మోత్సవం నాకు మరింత పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. అదీ సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments