Ramya Raghupathi:నరేష్ అఫైర్స్ అన్నీ విజయ నిర్మలకు తెలుసు.. పవిత్ర అలా దగ్గరైంది : రమ్య రఘుపతి సంచలనం
Send us your feedback to audioarticles@vaarta.com
చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరో నరేశ్, పవిత్రా లోకేష్‌ల వ్యవహారం ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. వీరు పెళ్లి చేసుకుంటారా, లేక సహజీనవంతోనే సరిపెడతారా అంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ ఇద్దరూ కలిసి ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేశారు. అంతేకాదు.. ఈ వీడియోలో పవిత్రకు లిప్ కిస్ పెట్టి లేటు వయసులోనూ తగ్గేది లేదని నిరూపించారు నరేష్. పెళ్లయితే చేసుకుంటామని చెప్పారు కానీ.. అది ఈ ఏడాదిలో ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు.
నా పిల్లాడి జీవితమే ముఖ్యం:
ఇదిలావుండగా.. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి గత కొన్ని రోజులుగా యూట్యూబ్ ఛానెల్స్‌తో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు పవిత్రా లోకేష్‌కు నరేష్ ఎలా దగ్గరయ్యాడు.. ఇద్దరి బంధం ఇక్కడిదాకా ఎలా వచ్చిందో చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేష్ విడాకులు కావాలని పిటిషన్ వేశారని, అదే తనకు పెద్ద ఆధారమన్నారు. ఆరు నెలలు కావొస్తున్నా తనపై చేసిన ఆరోపణలు మాత్రం ఆయన నిరూపించలేకపోయారని రమ్య దుయ్యబట్టారు. ఆస్తి కోసమే తాను ఇదంతా చేస్తున్నానని అంటున్నారని.. కానీ తనకు తన పిల్లాడి జీవితమే ముఖ్యమని, అందుకే పోరాటం చేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు.
ఆర్ధిక కారణాలతోనే నరేష్‌కి పవిత్ర క్లోజైంది:
నరేష్‌కు పవిత్రా లోకేష్ క్లోజ్ అవ్వడానికి కారణం కేవలం ఆర్ధిక పరమైన అంశాలే కారణమని రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తకు ఎంతో మందితో ఎఫైర్స్ వుండేవని, ఇప్పుడు ఇంట్లో అడిగేవారు లేకపోవడంతో పవిత్ర బాగా దగ్గరైందని ఆమె అన్నారు. మా అత్తగారికి ఇవన్నీ తెలిసినా.. నరేష్ ఎప్పటికైనా మారుతారని చెప్పేవారని రమ్య ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటానని రమ్య రఘుపతి స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com