Malli Pelli:నరేష్-పవిత్రల ‘‘మళ్లీ పెళ్లి’’ ట్రైలర్ : మరీ ఇంత బోల్డ్‌గానా.. కాంట్రవర్సీ అవుతుందో, కన్విన్స్ చేస్తారో

  • IndiaGlitz, [Thursday,May 11 2023]

పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్‌షిప్ వ్యవహారం టాలీవుడ్ , శాండిల్‌వుడ్‌లను ఈ ఏడాది ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రతి కార్యక్రమంలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. గతంలో సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసే వీరిద్దరూ ఇప్పుడు ఏకంగా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అదే ‘‘మళ్లీపెళ్లి’’. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్, ఫస్ట్‌లుక్ , పోస్టర్స్‌ ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. తాజాగా ‘‘మళ్లీపెళ్లి’’ నుంచి ట్రైలర్ రిలీజైంది. నరేష్, పవిత్రల నిజ జీవితంలో జరిగిన ఘటనలను ట్రైలర్‌లో కళ్లకు కట్టినట్లుగా చూపించారు.

ట్రైలర్‌లో బోల్డ్ కంటెంట్.. డైలాగ్స్ :

‘‘తెలుగు చిత్ర పరిశ్రమ కన్నడ వైపు చూపు తిప్పిందేంటీ..? అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. పార్వతి.. మీ ఆయన నిన్ను ఎలా చూసుకుంటాడు అని నరేష్ పవిత్రను అడుగుతాడు. దీనికి పార్వతి క్యారెక్టర్ అవును అని చెబుతుంది. అలా నరేష్, పవిత్ర బంధం, మా ఎన్నికలు, మైసూరులోని ఓ హోటల్‌లో పవిత్ర- నరేష్‌లను ఆయన మూడో భార్య పట్టుకోవడం, రమ్య రఘుపతి ప్రెస్ మీట్ చూపించారు. నరేష క్యారెక్టర్‌కు వున్న వెయ్యి కోట్ల ఆస్తిపై ఆయన మూడో భార్య కన్నేసినట్లుగా చూపించారు. ‘‘ముసలోడు అని కనికరించి పెళ్లి చేసుకుంటే ’’ అంటూ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ అక్కడక్కడా పేలాయి. ఇప్పటికే ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి.. నీతో రిలేషన్ అంటే అడిగే ప్రశ్న.. ఉంచుకున్నారా అని పవిత్రను డైలాగ్ ఆలోచింపజేస్తోంది. మొత్తంగా ఈ ట్రైలర్ ద్వారా నరేష్ , పవిత్రలు తమ నిజ జీవితాన్నే సినిమాగా చూపించబోతున్నారని తెలుస్తోంది. దీని ద్వారా మరిన్ని కాంట్రవర్సీలు వస్తాయో లేక, అందరి డౌట్స్‌ని క్లియర్ చేస్తారో తెలియాలంటే మే 26 వరకు వెయిట్ చేయాల్సిందే.

విజయకృష్ణ మూవీస్‌కు 50 ఏళ్లు :

ఎంఎస్ రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్రా లోకేష్‌లు ‘‘మళ్లీ పెళ్లి ’’ అనే సినిమా చేస్తున్నారు. నరేష్ తల్లి దివంగత విజయనిర్మల స్థాపించిన విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు నరేష్. ఈ బ్యానర్ స్థాపించి 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ‘‘మళ్లీ పెళ్లి’ సినిమాను నిర్మిస్తున్నారు నరేష్. ఈ సినిమాలో జయప్రద, శరత్ బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణమ్మ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నారు.