శివాజీ ప్యానెల్ డబ్బులు పంచడం బాధాకరం: నరేశ్

  • IndiaGlitz, [Sunday,March 10 2019]

‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. బస్తీ మే సవాల్ అంటూ రియల్ లైఫ్‌‌లో శివాజీ రాజా.. నరేశ్ తలపడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌‌లో బడా ఫ్యామిలీస్ మద్దతు తనకే ఉందని నరేశ్ చెబుతుండగా.. తాను చేసిన మంచి పనులే మరోసారి ‘మా’ అధ్యక్ష పీఠం దక్కేలా చేస్తాయని శివాజీ రాజా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహిళల మద్ధతు తనకుంది కచ్చితంగా వైస్ ప్రెసిడెంట్‌‌గా గెలుస్తానని నటి హేమ ధీమాతో ఉన్నారు.

ఆదివారం ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నువ్వా.. నేనా అంటూ రసవత్తరంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు అక్కడక్కడా కాసుల వర్షం కురిపించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ విషయంపై మా బరిలో ఉన్న నరేశ్ మాట్లాడుతూ.. అవును శివాజీ రాజా ప్యానెల్ డబ్బులు పంచుతున్నారు.. ఇలా చేయడం చాలా బాధాకరమని ఆయన చెప్పుకొచ్చారు. అయితే నరేశ్ ఆరోపణలపై శివాజీ రాజా మాత్రం స్పందించలేదు. పోలింగ్ అనంతరం శివాజీ రాజా, నరేశ్ ఇద్దరూ మీడియా మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం.

కాగా.. మధ్యాహ్నం 12గంటల వరకు 180 ఓట్లు పోలయ్యాయమని తెలుస్తోంది. ఇక రెండు గంటలకే పోలింగ్‌‌కు సమయం ఉంది. ఇప్పుడిప్పుడే నటీనటులంతా ఫిల్మ్‌ఛాంబర్‌‌కు చేరుకుంటున్నారు.

More News

రికార్డ్ స్థాయిలో ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్..

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల పోలింగ్ ముగిసింది. గత పది రోజులగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు 50శాతం తెరపడింది.

కుప్పకూలిన విమానం.. 157 మంది దుర్మరణం..!?

థియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 విమానం(ET 302) ఒకటి కుప్పకూలింది. అదిస్ అబాబా నుంచి నైరోబీకి వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

వైసీపీ ఎఫెక్ట్.. ఆ పార్టీ గుర్తు పక్కనెట్టిన ఎన్నికల కమిషన్!

ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రజాశాంతి పార్టీ కూడా తలపడుతున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్‌‌లో ట్రెండ్ సెట్ చేస్తున్న ‘96’ బ్యాక్‌డ్రాప్!

ప్రేమ తాలూకు జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తూ హృద్యమైన ఇతివృత్తంతో రూపొందిన తమిళ చిత్రం ‘96’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

నీరవ్ మోదీ నోట.. నో కామెంట్.. 8 లక్షల జాకెట్!

పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన వేల కోట్లరూపాయిల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త నీరవ్ మోదీ ఇండియా వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే.