'మా' మేనిఫెస్టో విడుదల చేసిన నరేశ్

  • IndiaGlitz, [Wednesday,March 06 2019]

'నువ్వా.. నేనా' అంటూ 'మా' (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ఎన్నికల్లో శివాజీ రాజా, నరేశ్ పోటాపోటీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోసారి అధ్యక్ష పదవి కోసం శివాజీరాజా తహతహలాడుతుండగా.. తనను గెలిపిస్తే ‘మా’ను అభివృద్ధి పథంలో నడిపిస్తానంటూ టాలీవుడ్ ‘పెద్ద’ల కుటుంబాలను కలిసే పనిలో నరేశ్ నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలువురు పెద్దలను కలిసిన ఆయన మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. అయితే తాజాగా మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. కాగా ఇంత వరకూ శివాజీ రాజా మేనిఫెస్టో విడుదల చేయలేదు.

విజన్..

‘మా’ సభ్యులందరూ ఆరోగ్యకరమైన.. సంతోషకరమైన హుందా జీవితాన్ని గడపడం

సమాజంలో ‘మా’ యొక్క గౌరవాన్ని పెంపొందించడం.. ఇనుమడింపజేయడం..

మేనిఫెస్టో..

మూవీ ఆర్టిస్ట్‌ సభ్యుల యొక్క గౌరవం ఇనుమడింపజేసేలలా సభ్యుల మధ్య సద్భావన పెంపొందించటం.

సభ్యులు చేసే పనుల్లో పారదర్శకత, జవాబుదారితనం కలిగి వుండటం.. జమా ఖర్చులను సభ్యులకు వివరించడం.

సభ్యులకు హెల్ప్‌లైన్‌లో అందుబాటులో ఉంటాం.. అత్యవసర సమయంలో 24/7 అందుబాటులో ఉంటాం.

వెల్ఫేర్ కమిటి సర్వే చేయడం ద్వారా అన్ని రకాల పథకాలకు పునాది వేయడం జరుగుతుంది. సభ్యుల కోరిక మేరకు రెండోసారి సర్వే చేసి పథకాలను పెంచడం జరుగుతుంది.

ఫెన్షన్ రూ. 5వేలు/- ప్రతి నెల

మెడికల్, లైఫ్ ఇన్సురెన్స్

ఎడ్యుకేషనల్ సపోర్ట్ కేజీ (టూ పీజీ)

కల్యాణ లక్ష్మి (రూ. 1,00,116/-)

బైక్స్ & స్యూటీస్

ఏ ఆధారమూ లేని ఒంటరి మహిళలకు.. ఒంటరి తల్లికి పెన్షన్ పథకాన్ని పెంచుతున్నాము.

తమను తాము వెండితెరపై మంచి పాత్రల్లో చూసుకోవాలని భావించే వారికోసం 'జాబ్ కమిటీ'ని ఏర్పాటు చేస్తామన్నారు. ‘మా’ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి అవకాశాలు లభించేందుకు కృషి చేస్తాం.

మహిళా ఆర్టిస్టులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తగు విధంగా కృషి చేసి.. ‘షీ టీమ్స్’ ద్వారా త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం.

'మా' ఆర్టిస్టులందరికీ సొంత ఇల్లు కలిగి ఉండాలన్నది మా కల. ఈ కలను సాకారం చేసేందుకు మేము కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్కీమ్‌ని, గవర్నరమెంట్ 'డబుల్ బెడ్రూమ్' స్కీమ్ ద్వారా లబ్ధి పొందడానికి గట్టిగా కృషి చేస్తాం.

వయో వృద్ధులైన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రశాంతమైన.. నిశ్చింతమైన జీవితాన్ని గడపడానికి 'గోల్డ్ ఏజ్ హోం' నిర్మిస్తాం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ రకాల పథకాల ద్వారా 'మా' మెంబర్స్ లబ్దిపొందేలా కృషి చేస్తాం.

‘మా’ సొంత భవన నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించి మా టర్మ్‌లో నిర్మించే ప్రయత్నం చేస్తాం.

మేనిఫెస్టో విడుదల అనంతరం నరేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆలోచనా విధానాల్లో తేడా ఉన్నప్పుడు ఎన్నికలు అనివార్యమవుతాయన్నారు. ‘మా’ లో కుర్చీలాట వద్దని, శివాజీరాజా మనసులో కోరికను అర్థం చేసుకుని.. తనకంటే నేను సీనియర్‌ అయినప్పటికీ, ‘మా’ బావుండాలనే ఉద్దేశంతో.

గత పర్యాయం అతణ్ణి అధ్యక్షుడిగా ఉండమని నేనే చెప్పాను. గతసారి ఏర్పడిన వివాదాలు, సమస్యల దృష్ట్యా ఎన్నికలకు వెళ్తున్నాం. మా మధ్య వ్యక్తిగత సమస్యలు లేవు అని నరేశ్ చెప్పుకొచ్చారు.

More News

జిమ్ ట్రైనర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌‌కు మహేశ్ ఫిదా

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు అందం.. బాడీ ఫిట్‌‌నెస్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆయనకు నాలుగు పదుల వయస్సు వచ్చినా ఇంకా ఇరవై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటారు.

కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

మొన్న ఓటుకు నోటు, నిన్న నాగార్జున సాగ‌ర్ ద‌గ్గర రెండు రాష్ట్రాల పోలీసుల గొడ‌వ‌, నేడు డేటా చోరీ కేసు. ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడుతున్న రాజ‌కీయ చద‌రంగంలో..

దారుణం.. ప్రీతిరెడ్డిని నరికి సూట్‌‌కేసులో కుక్కిన మాజీ ప్రియుడు!?

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దారుణం చోటుచేసుకుంది. గత ఆదివారం హైదరాబాద్‌కు చెందిన డెంటల్ డాక్టర్ ప్రీతి రెడ్డి (32) ఆస్ట్రేలియాలో అదృశ్యమైన సంగతి తెలిసిందే.

బాల‌య్య నిర్మాత చేంజ్‌

నంద‌మూరి బాల‌కృష్ణ 104వ చిత్రానికి రంగం సిద్ధమ‌వుతుంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌య్య‌

రానా చిత్రంలో హిందీ తార‌

ఆరోగ్య కార‌ణాల‌తో కాస్త గ్యాప్ తీసుకున్న రానా, ఇప్పుడు తన సినిమాల స్పీడు పెంచుతున్నాడు. ప్ర‌భు సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే 'హ‌థీ మేరే సాథీ' చిత్రం  షూటింగ్ ప్రారంభం కానుంది.