'మా' ఎన్నికలు.. నరేష్, రాజశేఖర్, జీవిత పోటీ

  • IndiaGlitz, [Saturday,March 02 2019]

తెలుగు సినిమా నటీనటుల సంఘం అధ్యక్ష ఎన్నికలు 2019-21 సంవత్సరానికి మా ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. మా అసోసియేషన్ అధ్యక్ష పదవికి నటుడు నరేష్ నామినేషన్ దాఖలు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. మా అసోసియేషన్ లో ఎన్నికలు కోరుకోం. మేమంతా ఓకే కుటుంబం. గత టర్మ్ రాజేంద్రప్రసాద్, శివాజీ రాజా, నేను ఉన్నాం. ఒక్కో టర్మ్ ఒక్కొక్కరు ఉండాలనుకున్నాం. ఈ టర్మ్‌లో పెద్దలు, సభ్యుల కోరిక మేరకు నేను పోటీ చేస్తున్నాను. నేను ఎప్పుడు పదవులు ఆశించలేదు. మహిళా జనరల్ సెక్రటరీ కోసం జీవితా రాజశేఖర్‌ను పోటీ చేయమని కోరాం. పోటీకి ఆమె అంగీకరించారు. ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్ పోటీకి ఒప్పుకున్నారు. కోశాధికారిగా కోటా శంకర్ రావు పోటీ చేస్తున్నారు. మార్చి 10న మా అసోసియేషన్ ఎన్నికలు జరుగుతాయి అని నరేష్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. నరేష్ నిజాయతీ మెచ్చే ఈ ఎన్నికల్లో పోటీకి ఒప్పుకున్నాం. ఈ ఎన్నికలో పోటీ లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. ప్రేమగా పని చేయడానికి మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని రాజశేఖర్ చెప్పారు.

జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. మా ఎన్నికల్లో ఆడవాళ్లకు కీలక పదవులు లేవు. ఈసారి స్వతంత్రంగానైనా పోటీ చేద్దామనుకున్నాను. నరేష్ వచ్చి జనరల్ సెక్రటరీగా పోటీ చేయమని కోరారు.. మారు మాట చెప్పకుండా నేను అంగీకరించాను. ఎన్నిక ఏకగ్రీవం కానందునే పోటీ చేస్తున్నాం. 'మా' గౌరవప్రదమైన స్థాయిలో ఉండాలి.

‘మా’ తలెత్తుకొని తిరగాలి. 'మా' అసోసియేషన్ సరిగా పనిచేయడం లేదని అనిపించింది. మా ఫ్యానల్‌ గెలిస్తే మంచి పనులు చేస్తాం. పని చేసేవాళ్లకే సభ్యులు ఓటెయ్యండి అని జీవితా రాజశేఖర్‌‌ 'మా' సభ్యులకు పిలుపునిచ్చారు. అయితే ఎలాంటి పోటీ లేకుండా ఎన్నిక జరుగుతుందో ..? లేకుంటే పోటీ ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

More News

బాలీవుడ్ వైపు కీర్తి చూపు...

ద‌క్షిణాది హీరోయిన్స్‌లో చాలా మంది బాలీవుడ్‌లో న‌టించాల‌నే అనుకుంటారు. బాలీవుడ్ సినిమాకున్న స్పాన్ అందుకు కార‌ణం. ఒక‌రిద్ద‌రు మిన‌హా దాదాపు ఎక్కువ మంది బాలీవుడ్‌లో న‌టించిన వారే.

పెళ్లైంది కానీ రాహుల్‌తో డేటింగ్ కావాల‌ట‌...

ఆమె బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌.. ఓ స్టార్‌ను పెళ్లి చేసుకుంది. అయితే రాజ‌కీయ నాయ‌కుడు రాహుల్ గాంధీతో డేటింగ్‌కి వెళ్లాల‌నుంద‌ని చెప్పి హాట్ టాపిక్ అయ్యింది.

బెల్లంకొండ శ్రీనివాస్ జ‌త‌గా...

1970 ద‌శకంలో పోలీసుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించి రాబిన్‌హుడ్‌గా పేరు మోసిన దొంగ  నాగేశ్వ‌రావు జీవితంపై సినిమా రానుంది. స్టూవ‌ర్టుపురం ప్రాంతంలోని నాగేశ్వ‌ర‌రావు చాలా తెలివిగా దొంగ‌త‌నాలు చేసేవాడు.

టీడీపీలో చేరిన కోట్ల దంపతులు

దశాబ్దాలుగా కాంగ్రెస్‌‌లో ఉన్న కోట్ల కుటుంబం పార్టీకి 'చేయి' ఇచ్చి టీడీపీలో చేరిపోయింది. ఒకప్పుడు కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ అంటే కోట్ల ఫ్యామిలీ.. కోట్ల అంటే కాంగ్రెస్ అన్న రీతిలో పరిస్థితులు

చంద్రబాబుపై మోహన్‌బాబు సంచలన ఆరోపణలు

రాజకీయాల్లో అయినా.. సినీ ఇండస్ట్రీ పరంగా అయినా ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడేసే వ్యక్తి నటుడు మంచు మోహన్‌బాబు.