Naresh-Pavitra Lokesh : పవిత్రకు లిప్ లాక్ ఇస్తూ నరేష్ ప్రకటన, ఏకంగా వీడియో రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
పవిత్రా లోకేష్- వీకే నరేష్.. ఈ రెండు పరిచయం లేని పేర్లు. లేటు వయసులో ఈ ఆంటీ అంకుల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కుర్రాళ్లు కూడా ఈ రేంజ్లో హల్చల్ చేయరేమో. అచ్చం సినిమా స్టైల్లో సాగిన వీరి రిలేషన్ ఈ ఏడాది చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న అత్యంత వివాదాస్పదమైన ఇష్యూగా నిలిచింది. చాలాకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నప్పటికీ.. ఈ మధ్యే విషయం బయటపడింది. ఇక ఆ తర్వాతి నుంచి ఇద్దరూ హైదరాబాద్, బెంగళూరులలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. సినిమా ఈవెంట్స్ అయినా ఫ్యామిలీ ఫంక్షన్సే అయినా ఇద్దరూ కలిసే అటెండ్ అవుతున్నారు. అంతా బాగానే వుంది కానీ ఇంతకీ వీరి పెళ్లెప్పుడు అంటూ అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.
లిప్ కిస్ పెట్టుకున్న నరేశ్-పవిత్రా లోకేష్:
అయితే న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని ఈ సస్పెన్స్‌కు తెరదించారు నరేశ్- పవిత్రా లోకేష్. తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఓ వీడియో వదిలారు. సినిమా ప్రోమోకు ఏ మాత్రం తగ్గని విధంగా కట్ చేసిన ఆ వీడియోలో నరేశ్, పవిత్ర కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోవడమే కాకుండా ఇద్దరూ లిప్ కిస్ ఇచ్చుకుని కలకలం రేపారు. 2023లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తమ జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభమవుతోందని... అంతా తమను ఆశీర్వదించాలని ఈ జంట ప్రేక్షకులను కోరింది. ప్రస్తుతం ఈ వీడియో సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.
ఇటీవలే సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేష్:
ఇదిలావుండగా.. ఇటీవల పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనతో రిలేషన్లో వున్న నరేష్‌పైనా, తనపైనా కొన్ని వెబ్సైట్లు, ఛానెళ్స్ ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని పవిత్రా లోకేష్ తెలిపారు. దీనిపై స్పందించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ ఫిర్యాదు స్వీకరించామని .. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
టాలీవుడ్ , శాండిల్‌వుడ్‌లను కుదిపేసిన పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్షిప్:
పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్షిప్ వ్యవహారం టాలీవుడ్ , శాండిల్‌వుడ్‌లను ఈ ఏడాది ఓ కుదుపు కుదిపింది. నరేష్, పవిత్రా లోకేష్‌ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిని ఇద్దరిలో ఎవ్వరూ ఖండించలేదు. కానీ చివరికి అవే నిజమయ్యాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా, కలిసేవుంటున్నారు. ఇదే సమయంలో నరేష్ మూడో భార్య రమ్య రఘపతి వీరిద్దరిని మైసూరులోని ఓ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాకుండా, చెప్పుతో కొట్టేందుకు సిద్ధమైంది.
సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియల నాడు పక్కపక్కనే:
నరేష్, పవిత్రలు తమకు వయసుకు తగ్గట్టుగా హీరో హీరోయిన్లకు తల్లిదండ్రులుగా, అత్తామామలుగా నటిస్తూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం.. రిలేషన్షిప్ వరకు వెళ్లిందని ఫిలింనగర్ జనాలు చెబుతూ వుంటారు. ఇక తమ వ్యవహారం అందరికీ తెలిసిపోవడంతో ఇద్దరూ నిర్భయంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల మరణించిన టాలీవుడ్ దిగ్గజం, సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల సమయంలోనూ వీరిద్దరూ పక్కపక్కనే వున్నారు. ఈ ఘటనకు ముందు నరేష్ - పవిత్రా లోకేష్‌లను వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా జనాలు అంతగా పట్టించుకోలేదు. కానీ కృష్ణ మరణానంతరం విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఇది శృతి మించడంతోనే పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout