Naresh, Pavithra:షాకిచ్చిన నరేష్ - పవిత్రా లోకేష్ : అది నిజం పెళ్లి కాదు, అంతా ‘‘మళ్లీపెళ్లి’’ కోసమే...!!
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటుడు వీకే నరేష్, కన్నట నటి పవిత్రా లోకేష్‌లు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో హీరోయిన్లు కలిసి తిరిగి రాని క్రేజ్ వీరిద్దరికి వచ్చేస్తోంది. అంతగా టాలీవుడ్, శాండిల్‌వుడ్‌లలో సంచలనం సృష్టించారు వీరిద్దరూ . అలాగే న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని పెళ్లికి సంబంధించిన సస్పెన్స్‌కు తెరదించారు నరేశ్- పవిత్రా లోకేష్. తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఓ వీడియో వదిలారు. సినిమా ప్రోమోకు ఏ మాత్రం తగ్గని విధంగా కట్ చేసిన ఆ వీడియోలో నరేశ్, పవిత్ర కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోవడమే కాకుండా ఇద్దరూ లిప్ కిస్ ఇచ్చుకుని కలకలం రేపారు. 2023లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తమ జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభమవుతోందని... అంతా తమను ఆశీర్వదించాలని ఈ జంట ప్రేక్షకులను కోరింది.
పెళ్లి వీడియో పెట్టి షాకిచ్చిన నరేష్- పవిత్రా లోకేష్:
ఆ తర్వాత ఈ నెల ప్రారంభంలో నరేష్- పవిత్రా లోకేష్‌లు పెళ్లిపీటలెక్కి షాకిచ్చారు. అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేసిన ఈ కపుల్ తమకు ఆశీస్సులు అందించాల్సిందిగా కోరారు. ‘‘ ఒక పవిత్ర బంధం .. రెండు మనసులు.. మూడు ముళ్ళు .. ఏడు అడుగులు , మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
- మీ పవిత్రా నరేష్ ’’ అంటూ నరేష్ ట్వీట్ చేశారు. పెళ్లి దుస్తుల్లో ఈ జంట చూడముచ్చటగా వున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ , తెలుగు సాంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. అయితే ఇది సినిమా పెళ్లా, నిజం పెళ్లా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇంటింటి రామాయణం సినిమా ఈవెంట్లో దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అవన్నీ ఇక్కడ కాదని, తర్వాత వీడిగా ప్రెస్‌మీట్ పెట్టి చెబుతానని నరేష్ స్పష్టం చేశారు.
ఎంఎస్ రాజు దర్శకత్వంలో మళ్లీ పెళ్లి :
ఆ వెంటనే ఇది సినిమా పెళ్లని తేలిపోయింది. ఎంఎస్ రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్రా లోకేష్‌లు ‘‘మళ్లీ పెళ్లి ’’ అనే సినిమా చేస్తున్నారు. నరేష్ తల్లి దివంగత విజయనిర్మల స్థాపించిన విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు నరేష్. ఈ బ్యానర్ స్థాపించి 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ‘‘మళ్లీ పెళ్లి’ సినిమాను నిర్మిస్తున్నారు నరేష్. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేసే అవకాశం వుంది.
మళ్లీపెళ్లి ఫస్ట్‌లుక్ విడుదల :
తాజాగా మళ్లీపెళ్లికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పవిత్ర సిగ్గుపడుతూ ముగ్గు వేస్తుండగా.. ఆమెను చూస్తూ నరేష్ నవ్వుతూ కనిపిస్తున్నారు. ఇందులో శరత్ బాబు, జయసుధ, వనిత విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, అన్నపూర్ణ, ప్రవీణ్ యండమూరి తదితరులు నటిస్తున్నారు. దీంతో నెటిజన్లు ఈ పోస్టర్‌పై కామెంట్స్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments