ప్రమాణ స్వీకారం రోజే కోటను అవమానించిన నరేశ్!
Send us your feedback to audioarticles@vaarta.com
‘మా’ (మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కొత్త కమిటీ శుక్రవారం రోజున ప్రమాణ స్వీకారోత్సవం అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇందుకు కారణం ఒకే ఒక్క నరేశ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఉపాధ్యక్షురాలు హేమ మాట్లాడుతుండగా నరేశ్ కోపంగా మైక్ లాక్కోవడం.. మరోవైపు సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు తన గళం వినిపిస్తుండగా.. నరేశ్, రాజశేఖర్ అడ్డుపడి ఆయన్ను అవమానించడంతో ప్రమాణ స్వీకారోత్సవం కాస్త రచ్చోత్సవంలాగా మారిపోయింది.
సీనియర్ అంటే లెక్కలేదా..!?
ఇంటర్వ్యూలు మొదలుకుని ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కోట శ్రీనివాసరావు కనీసం లేదంటే అరగంటపాటు ప్రసంగింస్తారు. ఇండస్ట్రీలో ఇలా ఉండండి..? అలా ఉండండి..? ఒకప్పుడు రోజులు మళ్లీ రావాలి..? తెలుగువారికి కూడా ప్రాదాన్యత ఇవ్వండి అని ఇలా చాలానే చెబుతుంటారు. అయితే శుక్రవారం జరిగిన మా ప్రమాణంలో మరోసారి తన గళం విప్పేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే సీనియర్ అనే ఏ మాత్రం గౌరవం లేకుండా.. నరేశ్, రాజశేఖర్ ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డారు. ఒకానొక సందర్భంలో ‘ఇక చాల్లేండి మీరు మాట్లాడింది’ అన్నట్లుగా రాజశేఖర్.. కోట చేతిలోనుంచి మైక్ తీసుకోబోయారు!. దీంతో కోట సభా ముఖంగా ఆ ఇద్దరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు కార్యక్రమానికి వచ్చిన పెద్దలు అసలు వీరిద్దరికీ సీనియర్ అంటే లెక్కలేదా..? అంటూ నోట్లో మాట బయట పెట్టలేక ఆగ్రహంతో రగిలిపోయారు!.
కృష్ణ మాట్లాడుతుంటే ఆపగలరా.. క్షమించండి!?
"తెలుగు వారి గురించి చెబుతున్నాను కదా... ఎవరికీ ఇష్టం ఉండదులెండి.? అందుకే ముగించు ముగించు అని బలవంతపెడుతున్నారు. అదే కృష్ణగారు మాట్లాడుతుంటే ముగించు అని అనగలరా?. సరే నేను మాట్లాడను. నా బాధ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇక ఏమీ చెప్పదలుచుకోలేదు. నా పొరపాటును క్షమించాలి.. తెలుగువారి గురించి ఎక్కువగా మాట్లాడితే ఇంతే. రైట్ సర్.. మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చక్కగా చిరకాలం కళకళలాడుతూ ఉండాలి. ఎక్కువగా మాట్లాడానేమో? కృష్ణ, విజయ నిర్మల, కృష్ణం రాజు నన్ను క్షమించండి" అని సభా వేదికగా కోట తీవ్ర అసంతృప్తి, ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోట డిమాండ్ ఇదీ...
"‘మా' కొత్త కమిటీ అయినా తెలుగు వారి గురించి మాట్లాడండి. తెలుగు వారినే తీసుకోవాలని డిమాండ్ చేయండి. మనది యూనియన్ కాకపోయినా ఇలాంటి ఒక నిబంధన తెస్తే నిర్మాతలు.. దర్శకులు పెట్టుకుంటారో? పెట్టుకోరో తర్వాత సంగతి. కనీసం ఆ నిబంధన ఎందుకు పెట్టారు? అని చర్చ వస్తుంది.." అని ఈ సందర్భంగా కోట.. కొత్త మా కమిటీకి సూచించారు. కాగా టాలీవుడ్ సినిమాల్లో తెలుగు నటీనటులకు కూడా అవకాశం ఇవ్వాలని సుమారు 1990 నుంచే కోట డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఆయన మాట ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే తాజాగా ఎన్నికైన కొత్త కమిటీ అయినా కోట మాటకు ప్రాధాన్యత ఇస్తుందో లేదో తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout