'మా' ఎలక్షన్స్: చిరును తప్పుదోవ పట్టించిన నరేశ్!
Send us your feedback to audioarticles@vaarta.com
‘మా’(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) రణరంగంలో సై అంటూ సీనియర్ నటులు నరేశ్-శివాజీ రాజా కాలుదువ్వుతున్నారు. మరోసారి అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు శివాజీ తహతహలాడుతుండగా.. ఈసారి కచ్చితంగా పీఠం తనదేనని నరేశ్ ధీమాగా చెప్పుకుంటూ టాలీవుడ్ పెద్దలను కలిసి మద్దతు కోరుతూ ముందుకెళ్తున్నారు .
టాలీవుడ్ నటీనటులు.. శివాజీ మరోసారి పీఠమెక్కిస్తారా..? లేకుంటే నరేశ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా అన్నది ఈనెల 10 జరగనున్న ఎన్నికలతో తేలిపోనుంది. ఈ క్రమంలో రాజకీయ నాయకుల్లాగే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
నరేశ్ నన్ను అవమానించాడు!
గురువారం రోజు శివాజీ రాజా మాట్లాడుతూ.. నరేశ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేష్ తనను అవమానించాడని..ప్రెసిడెంట్ పదవిని అవమానపరిచాడన్నారు. మెగాస్టార్ చిరంజీవిని నరేశ్ తప్పుదారి పట్టించారని శివాజీరాజా సంచలన షాకింగ్ కామెంట్స్ చేశారు. బర్త్ డే రోజున తనను నరేశ్ అవమానించాడని.. కానీ తాను ఎవర్నీ విమర్శించనని ఆయన చెప్పుకొచ్చారు. మెంబెర్స్ చూపిస్తున్న ప్రేమకు లొంగి ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
నరేశ్‌పై శివాజీ ఆరోపణలివీ...
"ప్రాణం పోయినా శ్రీకాంత్, నేను తప్పు చేయం. నరేష్ నా సోదరుడు. నా బర్త్‌డే రోజు నన్ను ఆఫీసులో.. మా ఆవిడను గుడిలో గంటల తరబడి నిరీక్షించేలా చేశాడు. మా అసోసియేషన్ పరువును రోడ్డుకు ఈడ్చొద్దు. ప్రతి కళాకారుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలనేదే మా తపన. 50 మంది నిరుపేద నటీనటులకు 6 నెలలపాటు నిత్యావసర సరుకులు అందజేస్తాం. ఫింఛన్ 7,500 అందజేస్తాం. నేను అరుణచలం వెళ్లిపోయినా పేద కళాకారులకు అందుబాటులో ఉంటాను" అని శివాజీ రాజా చెప్పుకొచ్చారు. అయితే శివాజీ వ్యాఖ్యలపై నరేశ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout