బయోపిక్ వార్తలపై నరేష్ క్లారిటీ
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటి, నిర్మాత, దర్శకురాలు, గిన్నిస్‌బుక్ రికార్డ్ హోల్డర్ విజయ నిర్మల గత ఏడాది ఆరోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 50 చిత్రాలను తెరకెక్కించిన విజయ నిర్మల సినిమా పరిశ్రమలోని ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈతరుణంలో ఈమె బయోపిక్‌ను తెరకెక్కించడానిరకి ఆమె తనయుడు నటుడు సీనియర్ నరేశ్ ప్రయత్నిస్తున్నారని కొన్నిరోజుల ముందు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను నరేష్ కొట్టి పారేశారు. తన తల్లి విజయనిర్మల బయోపిక్‌పై వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు.
విజయ నిర్మల బయోపిక్ కోసం ఎవరూ తనను సంప్రదించలేదని తాను ఎవరికీ బయోపిక్‌కి సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వలేదని సీనియర్ నరేష్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం సీనియర్ నరేష్ విజయ నిర్మల జీవితంపై మరింత రీసెర్చ్ చేస్తున్నానని, ఇది పూర్తి కావడానికి మరి కాస్త సమయం పట్టేలానే ఉందని పూర్తి కాగానే తర్వాత విషయాలపై ఫోకస్ పెడతానని నరేష్ వివరణ ఇచ్చుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments