బ‌యోపిక్ వార్త‌ల‌పై న‌రేష్ క్లారిటీ

  • IndiaGlitz, [Tuesday,April 28 2020]

సీనియ‌ర్ న‌టి, నిర్మాత‌, ద‌ర్శ‌కురాలు, గిన్నిస్‌బుక్ రికార్డ్ హోల్డ‌ర్ విజ‌య నిర్మ‌ల గ‌త ఏడాది ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూసిన సంగతి తెలిసిందే. 50 చిత్రాల‌ను తెర‌కెక్కించిన విజ‌య నిర్మ‌ల సినిమా ప‌రిశ్ర‌మ‌లోని ఎంద‌రో మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తోంది. ఈత‌రుణంలో ఈమె బ‌యోపిక్‌ను తెర‌కెక్కించ‌డానిర‌కి ఆమె త‌న‌యుడు న‌టుడు సీనియ‌ర్ న‌రేశ్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కొన్నిరోజుల ముందు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపించాయి. అయితే ఈ వార్త‌ల‌ను న‌రేష్ కొట్టి పారేశారు. త‌న త‌ల్లి విజ‌య‌నిర్మ‌ల బ‌యోపిక్‌పై వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని ఆయ‌న తెలిపారు.

విజ‌య నిర్మ‌ల బ‌యోపిక్ కోసం ఎవ‌రూ త‌న‌ను సంప్ర‌దించ‌లేదని తాను ఎవ‌రికీ బ‌యోపిక్‌కి సంబంధించిన ప‌ర్మిష‌న్స్ ఇవ్వ‌లేద‌ని సీనియ‌ర్ న‌రేష్ ఓ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అయితే ప్ర‌స్తుతం సీనియ‌ర్ న‌రేష్ విజ‌య నిర్మ‌ల జీవితంపై మ‌రింత రీసెర్చ్ చేస్తున్నాన‌ని, ఇది పూర్తి కావ‌డానికి మ‌రి కాస్త స‌మ‌యం ప‌ట్టేలానే ఉంద‌ని పూర్తి కాగానే త‌ర్వాత విష‌యాల‌పై ఫోక‌స్ పెడ‌తాన‌ని న‌రేష్ వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.

More News

మ‌రో సాయానికి శ్రీకారం చుట్టిన శేఖ‌ర్ క‌మ్ముల‌

ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు దొరికే సాయం చిన్న‌దా? పెద్ద‌దా? అని చూసుకోకూడ‌దు. ఎందుకంటే ప్రార్థించే పెదాల క‌న్నా.. సాయం చేసే చేతులే మిన్న అని మ‌నం వినే ఉంటాం.

పాన్ ఇండియా మూవీ '83' పై మేక‌ర్స్ క్లారిటీ

ఇండియన్ క్రికెట్‌ను గ‌తిని మార్చిన ఏడాది 1983. ఈ ఏడాది భార‌త‌దేశం క్రికెట్ ప్ర‌పంచంలో రారాజుగా అవ‌త‌రించింది. క‌పిల్ డేర్ డెవిల్స్ సాధించిన అపూర్వ విజ‌యంతో

స‌స్పెన్స్‌కు తెర దించిన చిరంజీవి

కరోనా ప్ర‌భావంతో సినీ సెల‌బ్రిటీలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కుటుంబ స‌భ్యుల‌తో స‌ర‌దాగా స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు.

రాబోయే రోజుల్లో కరోనా కేసుల్లేని రాష్ట్రంగా తెలంగాణ : కేసీఆర్

తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. రోజుకు సింగిల్ డిజిట్‌లోనే మూడు, ఏడు, ఎనిమిది కేసులు మాత్రమే నమోదవుతున్నాయి.

డిజిటల్ మాధ్యమంలోకి తేజ..!

డైరెక్టర్ తేజ త్వరలోనే డిజిటల్ మీడియంలోకి అడుగు పెట్టబోతున్నారు. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ప్రముఖ డిజిట‌ల్ మీడియం సంస్థ అమెజాన్ ప్రైమ్ చ‌ర్చ‌లు జ‌రిపింద‌ట‌.