లగ్జరీ కార్‌వాన్ కొన్న సీనియర్ నటుడు నరేశ్.. ప్రత్యేకతలివే..!!
Send us your feedback to audioarticles@vaarta.com
కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తోన్న సినీ పరిశ్రమ ఆధునికంగా ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంటోంది. గతంలో లేని లేని ఎన్నో సదుపాయాల రాకతో సినిమాలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. వీటిలో చెప్పుకోవాల్సింది కార్‌వాన్‌లు. బ్లాక్ అండ్ వైట్ కాలంలో నటీనటుడు ఔట్ డోర్ షూటింగ్‌ల సమయంలో తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. మేకప్, వాష్‌రూమ్, కనీసం బట్టలు మార్చుకోవాలన్నా చెట్లు, పొదలే గతి. అయితే కాలక్రమంలో కార్‌వాన్‌లు అందుబాటులోకి రావడంతో చాలా వరకు కష్టాలు తీరిపోయాయి. కదిలే ఇళ్లుగా పేరుగాంచిన ఈ వాహనాల్లో ఇంటిలో వుండే సమస్తం వుంటాయి. నిర్మాతలు, ప్రొడక్షన్ కంపెనీలే తొలినాళ్లలో కార్‌వాన్‌లు సమకూర్చేవి. అయితే ప్రస్తుతం స్టార్స్ ఎవరికి వారు సొంతంగా కార్‌వాన్‌లు కొనుగోలు చేసుకుంటున్నారు. తెలుగు నాట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొద్దినెలల క్రితం విలాసవంతమైన కార్‌వాన్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ లిస్ట్‌లోకి సీనియర్ హీరో నరేశ్ చేరారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు నరేశ్. ఈ ఏడాదిలో తన చేతి నిండా సినిమాలున్నాయని ఇటీవల నరేశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో ఆయన ఇంట్లో కంటే కార్‌వాన్‌లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఇతర నటీనటులు వాడిన కార్‌వాన్ వాడటం మంచిది కాదని భావించిన నరేశ్ ఇటీవల ప్రత్యేకంగా ఓ వ్యాన్‌ని కొనుగోలు చేశారు. తన అభిరుచులకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దారు. ఏసీతో ఉన్న ఈ వ్యాన్‌లో బెడ్, మేకప్ ప్లేస్, జిమ్, వెయిటింగ్ రూమ్, వాష్‌రూమ్ వంటివి ఉన్నాయి. అన్ని సౌకర్యాలతో సిద్ధమైన ఈ వ్యాన్‌ని నరేశ్ ఎంతో ఖర్చు చేసి ముంబయి నుంచి తెప్పించుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com