ప్రధానిగా రెండోసారి మోదీ ప్రమాణం.. 2.0 టీమ్ ఇదే..
Send us your feedback to audioarticles@vaarta.com
నరేంద్ర మోదీ రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో సరిగ్గా సాయంత్రం 7గంటలకు ఈ మహోత్తర కార్యక్రమం జరిగింది. ఈ మహోత్సవానికి ఎన్డీఏ మిత్రపక్షాలు, బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభిమానులు, నేతలతో రాష్ట్రపతి భవన్ జనసంద్రంగా మారింది. దేశ, విదేశీ ప్రభుత్వాధినేతలు, ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు వంటి సుమారు 8 వేల మంది విశిష్ట అతిథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. మోదీ చేత రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేయించారు. ‘నరేంద్ర దామోదర్ దాస్ అను నేను...’ అంటూ మోదీ ప్రధానిగా ప్రమాణం చేశారు. మోదీ ప్రమాణ పత్రం చదువుతున్న సమయంలో ‘బోలో భారత్ మాతాకీ జై’.. అంటూ నినాదాలతో రాష్ట్రపతి భవన్ పరిసరాలు మార్మోగిపోయాయి. మరోవైపు.. మోదీ అనంతరం కేంద్రమంత్రిగా రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, రామ్ విలాస్ పాశ్వన్, రవిశంకర్ ప్రసాద్, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, థావర్ చంద్ గెహ్లాట్, జయశంకర్, రమేశ్ పోఖ్రియాల్, అర్జున్ ముండా, స్మృతీ ఇరానీ, డాక్టర్ హర్షవర్దన్, ప్రకాశ్ జవదేకర్‌లతో పాటు పలువురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ అనంతరం పత్రాలపై సంతకాలు చేశారు. అయితే.. వీరికి శాఖలు ఇంకా ఖరారు చేయలేదు. త్వరలో వీరందరికీ శాఖలను కేటాయించే అవకాశముంది. అమిత్ షా కేంద్ర క్యాబినెట్ లో అడుగుపెట్టడం ఇదే ప్రథమం. 2014లో మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. 2019 ఎన్నికల్లో ఎవరి సపోర్టూ లేకుండానే బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ప్రమాణానికి గంట ముందు భారీ షాక్..
ప్రధానమంత్రిగా రెండవసారి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేయబోయే గంట ముందు ఎన్డీయేలో కీలక పక్షం అయిన జేడీయూ.. బీజేపీకి భారీ షాక్ ఇచ్చింది. మంత్రి వర్గంలో ఒక క్యాబినేట్, ఒక సహాయ మంత్రి పదవులు ఇవ్వచూపడంపై పార్టీ అధినేత నితీశ్ కుమార్ ఆగ్రహంతో రగిలిపోయిన నితీశ్ కుమార్.. తాము మంత్రి వర్గంలో చేరబోవడం లేదంటూ తేల్చి చెప్పేశారు. దీంతో ఆదిలోనే ఎన్డీయేలో లుకలుకలు మొదలైనట్లు భావిస్తున్నారు. బీజేపీతో కలిసి బిహార్‌లో స్వీప్ చేసిన జేడీయూ సొంతంగా 16 ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. కాగా.. మరో మంత్రి పదవి కలిపి మొత్తం రెండు మంత్రుపదవులతో నితీశ్‌ను శాంతపరుస్తారో లేకుంటే మెజార్టీ ఉంది కదా అని లైట్ తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com