మోదీ మద్ధతు మహాభారతం కష్టాలు తీరుతాయా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటి వరకు ఇండియన్ సినిమా బడ్జెట్ అంటే ఐదు వందల కోట్లు కూడా దాటలేదు. బాహుబలి, రోబో చిత్రాలు కూడా 450 కోట్ల బడ్జెట్‌లోనే ఆగిపోయాయి. ఇప్పుడు ఏకంగా 1000కోట్లతో మహాభారతం సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్‌లాల్ భీముడిగా కనిపించనున్న ఈ సినిమాలో ఇండియాలోనే టాప్ స్టార్స్ అంతా తెరపై కనిపించనున్నారు. నాగార్జున అక్కినేనిని కూడా కర్ణుడి పాత్ర కోసం అప్రోచ్ అయ్యారు. వాసుదేవ్ నాయర్ రాసిన రెండామూలం అనే నవల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. యు.ఎ.ఇ.కి చెందిన భారత సంతతి వ్యక్తి డా.బి.ఆర్.శెట్టి ఈ సినిమాను నిర్మించనుంటే యాడ్ ఫిలింమేకర్ వి.ఎ.శ్రీకుమార్ డైరెక్ట్ చేయబోతున్నారట. రెండు భాగాలుగా మహాభారతం మూవీని తెరకెక్కించనున్నారు. 2018 సెప్టెంబర్‌లో సినిమా సెట్స్‌లోకి వెళుతుంది.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందిస్తారట. మిగతా భారతీయ భాషల్లోకి అనువదిస్తారు. అయితే రెండా మూలం అనే నవల ఆధారంగా రూపొంనుండటంతో మహాభారతం అనే టైటిల్ పెట్టకూడదంటూ కేరళకు చెందిన ఓ హిందూ సంఘం అప్పుడే హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ చిత్ర యూనిట్‌కు ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ నుండి మహాభారతం సినిమా చేస్తుండటం పట్ల అభినందన లేఖ రావడంతో పెద్ద అభయమే దొరికినట్టయ్యింది. అంతే కాకుండా ఈ చిత్రయూనిట్‌కు మోదీ అపాయింట్‌మెంట్‌కు దొరికిందట. మోదీ మద్ధతులో మహాభారతం కష్టాలు తీరినట్టేననిపిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments