ప్రధానిగా మోదీ ప్రమాణం.. కేంద్రమంత్రులు వీళ్లే!
Send us your feedback to audioarticles@vaarta.com
భారతీయ జనతాపార్టీ ఎవరు సపోర్టు లేకుండా స్వతంత్రంగా పోటీచేసి ఎవరూ ఊహించని రీతిలో సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం మోదీ మానియా.. షా చరిష్మా మాత్రమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రేపు అనగా మే-30న మోదీ.. వరుసగా రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సరిగ్గా రేపు రాత్రి 7గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ తరుణంలో ఆయనతో పాటు ఎవరెవరు మంత్రులుగా ప్రమాణం చేస్తారు..? ఎన్నికల్లో టికెట్లు దక్కనట్లుగా.. కేబినెట్‌లో సీనియర్లకు మంత్రి పదవులు దక్కుతాయా..? లేదా అనేదానిపై దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చ జరుగుతోంది.
అయితే.. ఇప్పటికే గతంలో ఆర్థిక మంత్రిగా సేవలు అందించిన అరుణ్ జైట్లీ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో సీనియర్ అయిన జయంత్ సిన్హా పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు విదేశాంగ మంత్రి రేసు నుంచి సుష్మా స్వరాజ్ తప్పుకోగా.. తెరపైకి స్మృతీ ఇరాని వచ్చింది. రక్షణ మంత్రిగా ఇదివరకు నిర్మలా సీతారమన్ ఉండగా.. ఈసారి రాజీవ్ ప్రతాప్ రూడీకి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే అమిత్‌షాకు హోం మంత్రి పదవి అంటూ ఢిల్లీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
రాజ్‌నాథ్ సింగ్‌కు కేబినెట్‌లో అవకాశం ఉంటుంది కానీ హోం శాఖ ఇవ్వరని.. ఈసారి ఆయనకు వ్యవసాయ శాఖ దక్కే అవకాశముంది. రైల్వే మంత్రిగా పీయూష్ గోయల్ పదవి చేపట్టే అవకాశాలున్నాయి. అయితే గతంలో రక్షణమంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌కు ఈసారి.. మానవ వనరుల మంత్రిత్వ శాఖ దక్కే చాన్స్ ఉంది. గతంలో ఈ శాఖ స్మృతీ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. రవాణాశాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ మరోసారి కొనసాగే అవకాశం ఉంది.
కిరణ్ రిజిజుకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది.. ఈ సారి పెట్రోలియం శాఖ దక్కే ఛాన్స్ ఉంది. కాగా.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్‌కు ఈసారి కేంద్రమంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని ఢిల్లీలో పుకార్లు వస్తున్నాయి. అయితే గతంలో ఆరోగ్య శాఖకు జేపీ నడ్డా న్యాయం చేశారని.. ఇప్పుడు మరోసారి ఆయనకే ఆ శాఖ కట్టబెట్టాలని కమలనాథులు అనుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రమాణానికి ప్రముఖులు హాజరు!
ఇదిలా ఉంటే.. రేపు జరగనున్న ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల అధినేతలు ఈ వేడుకకు హాజరు కానున్నారు. మరోవైపు మోదీ ప్రమాణ స్వీకారానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాను హాజరుకాలేనని.. బెంగాల్‌లో రాజకీయ హింసలో చనిపోయిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలను మోదీ ప్రమాణ స్వీకారానికి పంపడమే కారణమన్నారు. మరోవైపు మోదీ రాజకీయ ప్రత్యర్థి, కాంగ్రెస్ వైస్ చైర్మన్ సోనియా గాంధీ హాజరు కాబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com