పాక్‌పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: మోదీ
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి ప్రస్తావిస్తూ.. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. గురువారం రోజున 'మేరా బూత్ సబ్‌సే మజ్‌బూత్' కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కాగా ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్. సుమారు 15,000 ప్రాంతాల నుంచి కోటి మందికి పైగా కార్యకర్తలతో మోదీ ఇంటరాక్ట్ అయినట్లు తెలుస్తోంది.
దుశ్చర్యలను తిప్పి కొట్టాలి..
"శత్రువు మనల్ని అస్థిరపరచాలని చూస్తున్నాడు. ఉగ్రదాడుల ద్వారా శత్రువు మనల్ని అస్థిరపరచి, ఎదగకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో మనమంతా ఒక్కటిగా నిలబడి వారి దుశ్చర్యలను తిప్పికొట్టాలి. ఇండియా ఒక్కటిగా జీవిస్తుంది.. ఒక్కటిగా పోరాడుతుంది.. ఒక్కటిగా గెలుస్తుంది. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు. సరిహద్దులో పాకిస్థాన్ చర్యల వల్ల అటు సైనికులకు గానీ, ఇటు దేశ ప్రజలకు గానీ ఆత్మస్థైర్యం ఏమాత్రం దెబ్బతినలేదు" అని మోదీ అన్నారు.
సైనికులంతా ముందుండుగేయండి!
"బూత్ సైనికులంతా ముందడుగేయాల్సిన సమయం వచ్చింది. మీ బూత్‌లో మీరు గెలిస్తే.. ప్రజల హృదయాలను గెలుచుకోగలిగితే.. దేశం కోసం మీరే ప్రత్యక్షంగా పనిచేయవచ్చు. ప్రతీ రంగంలోనూ మనం కష్టపడి పనిచేస్తున్నాం. రక్షణగా నిలుస్తున్న ప్రతీ ఒక్కరి పట్ల దేశం కృతజ్ఞతతో ఉంటుంది. వాళ్లు ఉన్నారు కాబట్టే దేశం అభివృద్దిలో మరింత ముందుకెళ్తోంది. ప్రజలు బీజేపీని మరింతగా అర్థం చేసుకుంటారు. పార్టీ గురించి వారికి తెలిసినప్పుడే, మిగతా పార్టీలకు మనకు ఉన్న తేడా ఏంటో వారు గ్రహించగలరు" అని ప్రధాని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
వీలైనంత ఎక్కువ మందికి చేరువ చేయాలి..
"'మేరా పరివార్ బీజేపీ పరివార్' అన్న నినాదం ప్రతీ ఒక్కరిది కావాలి. ఇందుకోసం మీరు ప్రతీ ఒక్కరికి చేరువ కావాలి. తొలిసారి ఓటు హక్కు పొందిన ఓటర్లకు చేరువ కావడం బూత్ వర్కర్స్ ముందున్న ప్రధాన లక్ష్యం. పని విషయంలో బూత్ వర్కర్లు ఒకరితో ఒకరు ఆరోగ్యకర రీతిలో పోటీ పడి పనిచేయాలి. వీలైనంత ఎక్కువమందికి పార్టీని చేరువ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నుంచి భారత్‌ను గట్టెక్కించడానికి ప్రతీ పౌరుడు ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఉన్నాడు. ప్రతీ పౌరుడు అటు తనపై తాను, ఇటు ప్రభుత్వంపై సడలని నమ్మకంతో ఉన్నాడు. ఇది మనం సాధించిన గొప్ప విజయం అనే చెప్పాలి. ఈ ఐదేళ్లలో ప్రతీ పౌరుడు మార్పును గమనిస్తున్నాడు. ఒకవేళ మేమే మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందో ఊహించండి. కేవలం నాణ్యమైన పాలనను అందించడమే కాదు.. దాన్ని అదే రీతిలో ముందుకు తీసుకెళ్తున్నాం" అని మేరా బూత్ సబ్‌సే మజ్‌బూత్ కార్యక్రమంలో మోదీ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments