కేసీఆర్‌ను చూసి మోదీ కూడా నేర్చుకున్నారు!
Send us your feedback to audioarticles@vaarta.com
తృణముల్ కాంగ్రెస్‌కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లు ఉన్నారన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇష్టానుసారం మాట్లాడుతారా అని కన్నెర్రజేసిన టీఎంసీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అయితే మోదీ వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. మరోవైపు మోదీ, అమిత్ షాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మోదీతో నిజంగానే 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారా..? అనేది దేవుడెరుగు కానీ.. ఆయన అన్న వ్యాఖ్యలు మాత్రం మమతా పార్టీలో ప్రకంపనలు సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు పార్టీలు, అధిపతులు, నేతలు మీడియా ముఖంగా తీవ్రంగా తప్పుబట్టిన విషయం విదితమే.
అయితే తాజాగా మోదీ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇన్ని రోజులు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రైతు బంధు’ పథకాన్ని అన్ని రాష్ట్రాలు కాపీ కొట్టాయని వాటితో పాటు బీజేపీ కూడా కాపీ కొట్టిందని కేసీఆర్ చెప్పుకుంటున్నారని.. అయితే అది ఎంత వరకు నమ్మాలో లేదో తెలియదు కానీ.. కేసీఆర్ తెలంగాణలో ఎమ్మెల్యేలను లాక్కున్నట్లుగా మోదీ కూడా లాక్కునే ప్రయత్నంలో భాగంగా టీఎంసీ సంబంధించిన ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారని ఇదొక్కటి మాత్రం కేసీఆర్‌ను మోదీ ఫాలో అయ్యారని విజయశాంతి సెటైర్లు వేశారు.
విజయశాంతి ఫేస్‌బుక్ పోస్ట్ యథావిథిగా...
"రైతుబంధు పేరుతో తాము ప్రవేశపెట్టిన పథకాన్ని మోదీ నేతృత్వంలోని బీజేపీ కాపీ కొట్టిందని కేసీఆర్ గారు ఇంతకాలం కథలు చెప్పారు. కానీ కేసీఆర్ గారిని చూసి, సంక్షేమ పథకాలను కాపీ కొట్టారో లేదో కానీ...విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, వారిని తమవైపు ఎలా లాక్కోవాలో అనే కుట్రను నరేంద్రమోదీ గారు కేసీఆర్ గారిని చూసి బాగా వంటబట్టించుకున్నట్లున్నారు. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని, లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మమత ప్రభుత్వం కూలిపోతుందని మోదీ గారు హెచ్చరించడం ప్రజాస్వామ్యానికి దుర్దినం. ఈ రాక్షస క్రీడ తెలంగాణలో మొదలై, దేశమంతా మహమ్మారిలా వ్యాపిస్తోంది.
ఈ దుస్సాంప్రదాయానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపు చట్టాన్ని సంస్కరించి, పార్టీ మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై వెంటనే వేటు వేసే విధంగా నిబంధనలు తీసుకు వస్తామనే అంశాన్ని చేర్చడం జరిగింది. కాంగ్రెస్ ఛీప్ రాహూల్ గాంధీ గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశంలోని బీజేపీ ఏతర పార్టీలన్నీ సమర్ధించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ వైపు సీబీఐ, ఐటీ దాడుల పేరుతో ప్రతిపక్షాలకు చెందిన నేతలను భయాందోళనకు గురిచేస్తూ, మరోవైపు ప్రత్యర్ధి పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే నీచ రాజకీయాలకు బీజేపీ తెరలేపుతోంది. ఈ పరిణామాలకు చరమగీతం పాడేందుకు రాహూల్ గాంధీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని విజయశాంతి చెప్పుకొచ్చారు. అయితే రాములక్క వ్యాఖ్యలపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout