అద్వానీకి మరోసారి మోడీ మొండిచేయి!
Send us your feedback to audioarticles@vaarta.com
బీజేపీ కురువృద్ధుడు, కమలదళంలో పేరుగాంచిన కీలక నేత అయిన ఎల్‌కే అద్వానీకి.. ప్రధాని మోదీ మరోసారి మొండిచేయి చూపారు!. ఇప్పటికే కేబినెట్‌లోకి తీసుకోకుండా తీవ్ర అన్యాయం చేయడంతో పాటు పార్టీలో ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందని ఆయన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా..? లేదా అనే విషయం ఇంతవరకు స్పష్టత రాలేదు.
అయితే ఈ సమయంలో అద్వానీ వ్యక్తిగత కార్యదర్శి దీపక్ చోప్రా ఉన్నట్లుండి బాంబు పేల్చారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా అధిష్టానం నుంచి అద్వానీకి ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. అంతటితో ఆగని ఆయన.. అద్వానీ లాంటి వ్యక్తి తాను పోటీ చేస్తానని అధిష్టానాన్ని అడగడం సముచితం కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే మున్ముంథు ఏం చేయాలి..? భవిష్యత్ కార్యాచారణపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారని దీపక్ మిశ్రా మీడియాకు వివరించారు.
కాగా.. 91 ఏళ్ల అద్వానీ ఇప్పటికే డిప్యూటీ ప్రధానిగా, హోంమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. 80, 90 దశకాల్లో బీజేపీ పురోగతిలో అద్వానీ కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. అయితే ఎప్పుడైతే మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందో నాటి నుంచి నేటివరకూ అద్వానీ సైలెంట్‌గా ఉండిపోయారు. అంతేకాదు ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే మొదట అద్వానీనే వ్యతిరేకించారని.. దీంతో పీఎం పీఠమెక్కిన నాటి నుంచి మోదీ రివెంజ్ తీసుకుంటున్నారని కూడా కొందరు విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఈ ఎన్నికల్లో అయినా కురువృద్ధుడికి పోటీ చేసే అవకాశాన్ని మోదీ నిశితంగా ఆలోచించి ఇస్తారా..? లేకుంటే టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదంటూ మిన్నకుండిపోతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments