మోదీ 2.0 కేబినెట్‌లో శాఖల కేటాయింపు

  • IndiaGlitz, [Friday,May 31 2019]

నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం గురువారం నాడు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. గురువారం కేవలం మంత్రులుగా ప్రమాణం చేయగా.. ఇవాళ వారందరికీ శాఖలను కేటాయించడం జరిగింది. బీజేపీ-సారథ్యంలోని ఈ ఎన్‌డీఏ సర్కారులో మొత్తం 57 మందికి మంత్రులుగా అవకాశమివ్వగా.. వీరిలో 36 మంది గతంలో చేసినవారే కాగా 21 మంది కొత్తవారు ఉన్నారు. మంత్రివర్గంలో 24 మందికి కేబినెట్‌ హోదా ఇచ్చారు. 9 మందికి స్వతంత్ర ప్రతిపత్తితో మంత్రులను చేశారు. ఎవరెవరికి ఏయే శాఖలు దక్కాయంటే..

నరేంద్ర మోదీ: ప్రధానమంత్రి, అటామిక్ ఎనర్జీ, స్పేస్, ప్రజా ఫిర్యాదులు

రాజ్ నాథ్ సింగ్: రక్షణ శాఖ

అమిత్ షా: హోం శాఖ

నిర్మాలా సీతారామన్: ఆర్థిక శాఖ

ఎస్.జయశంకర్: విదేశాంగ శాఖ

నితిన్ గడ్కరీ: జాతీయ రహదారులు మరియు రోడ్డు రవాణా, చిన్న మధ్య తరగతి పరిశ్రమలు

రాంవిలాస్ పాశ్వాన్: వాణిజ్య శాఖ, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ

నరేంద్ర సింగ్ తోమార్: వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ

రవిశంకర్ ప్రసాద్: న్యాయ శాఖ, సమాచార శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ

హర్ సిమ్రత్ కౌర్ బాదల్: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ

తావర్ చంద్ గెహ్లాట్: సోషల్ జస్టిస్ మరియు ఎంపవర్ మెంట్ శాఖ

రమేష్ పోఖ్రియల్ నిశాంక్: మానవ వనరుల శాఖ

స్మృతి ఇరానీ: మహిళా శిశు సంక్షేమ శాఖ, టైక్స్ టైల్స్ శాఖ

హర్షవర్దన్: ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, ఎర్త్ సైన్సెస్ శాఖ

ప్రకాశ్ జవదేకర్: పర్యావరణం, అడవుల శాఖ, సమాచార ప్రసార శాఖ

పియూష్ గోయల్: రైల్వే శాఖ, పరిశ్రమల శాఖ

ధర్మేంద్ర ప్రదాన్: పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ, ఉక్కు శాఖ

ప్లహ్లాద్ జోషి: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, బొగ్గు శాఖ, గనుల శాఖ

మహేంద్రనాథ్ పాండే: స్కిల్ డెవలప్ మెంట్ మరియు ఎంటర్ ప్రిన్యూర్ షిప్ శాఖ

ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి: మైనారిటీ వ్యవహారాల శాఖ

సదానందగౌడ: కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ శాఖ

గజేంద్రసింగ్ షెకావత్: జలశక్తి శాఖ

అరవింద్ గణపత్ సావంత్: భారీ పరిశ్రమలు

గిరిరాజ్ సింగ్: డైరీ, మత్స్య, యానిమల్ హస్బెండరీ శాఖ

సంతోష్ కమార్ గాంగ్వర్ (స్వతంత్ర) - శ్రామిక, ఉపాధి కల్పన శాఖ

ఇంద్రజీత్ సింగ్ (స్వతంత్ర) - ప్రణాళిక, గణాంక శాఖ

రాజ్ కుమార్ సింగ్ (స్వతంత్)- విద్యుత్ సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి

ఫగన్ సింగ్ కులస్థే - ఉక్కు శాఖ సహాయ మంత్రి

అర్జున్ రామ్ మేఘవాల్ - పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు సహాయ మంత్రి

జనరల్ వీకే సింగ్ - రహదారులు, రవాణా శాఖ సహాయ మంత్రి

కిషన్‌ రెడ్డి - హోంశాఖ సహాయక మంత్రిత్వ శాఖ

సంతోష్ కుమార్ గంగ్వార్: లేబర్ మరియు ఎంప్లాయ్ మెంట్ శాఖ (ఇండిపెండెంట్)

ఇందర్ జిత్ సింగ్: గణాంకాల శాఖ (ఇండిపెండెంట్), ప్రణాళిక శాఖ (ఇండిపెండెంట్)

శ్రీపాద్ నాయక్: ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ద, హోమియోపతి శాఖ (ఇండిపెండెంట్), రక్షణ శాఖ సహాయమంత్రి

జితేంద్ర సింగ్: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ (ఇండిపెండెంట్), ప్రధాని కార్యాలయం సహాయ మంత్రి... ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల సయాయ మంత్రి...

అటామిక్ ఎనర్జీ సహాయ మంత్రి, అంతరిక్ష శాఖ సహాయమంత్రి

కిరణ్ రిజిజు: క్రీడలు, యువజన శాఖ (ఇండిపెండెంట్), మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి

ప్రహ్లాద్ సింగ్ పటేల్: టూరిజం మరియు సాంస్కృతిక శాఖ (ఇండిపెండెంట్)

రాజ్ కుమార్ సింగ్: పునరుత్పాదక శక్తి శాఖ (ఇండిపెండెంట్), స్కిల్ డెవలప్ మెంట్ మరియు ఎంటర్ ప్రిన్యూర్ షిప్ శాఖ సహాయమంత్రి

హర్దీప్ సింగ్ పూరి: హౌసింగ్ మరియు అర్బర్ వ్యవహారా శాఖ (ఇండిపెండెంట్), పౌర విమానయాన శాఖ (ఇండిపెండెంట్), పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ సహాయ మంత్రి

మన్షుక్ మండవీయ: షిప్పింగ్ (ఇండిపెండెంట్), కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ సహాయ మంత్రి

More News

'స్టూవర్టుపురం' ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన సుకుమార్

అర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో గూఢచారి ఫేమ్ ప్రీతి సింగ్ ప్రధానపాత్రలో సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ "స్టూవర్టుపురం".

మహేశ్‌ లేకుండానే ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రారంభం..

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో కొత్త సినిమా ప్రారంభమైంది.

మహర్షి చిత్రం 100 కోట్ల షేర్‌ దాటి సూపర్‌ కలెక్షన్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా రన్‌ అవుతోంది - దిల్‌ రాజు

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా అందించిన 'మహర్షి'

వైఎస్‌ను మించి.. మళ్లీ మళ్లీ జగనే సీఎం!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో వైసీపీ గెలుపొందగా.. ఫ్యాన్ గాలికి అటు సైకిల్ గానీ ఇటు గ్లాస్ కానీ దరిదాపుల్లోకి రాలేకపోయాయి.

ప్రధానిగా రెండోసారి మోదీ ప్రమాణం.. 2.0 టీమ్ ఇదే..

నరేంద్ర మోదీ రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో సరిగ్గా సాయంత్రం 7గంటలకు ఈ మహోత్తర కార్యక్రమం జరిగింది.