తప్పులో కాలేసిన మోదీ.. నలుగురిలో నవ్వుల పాలు!
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిన పేరు పాకిస్థాన్, అభినందన్, సర్జికల్ స్ట్రైక్స్ అనే విషయం తెలిసిందే. అయితే పదే పదే ప్రెస్మీట్స్, సభల్లో పలికిన ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడున్నా ఆ పదాలే అనుకోకుండా నోటి నుంచి వచ్చేస్తున్నాయ్. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. పాక్ ప్రస్తావన తెచ్చిన మోదీ.. సర్జికల్ స్ట్రైక్స్ గుర్తు చేస్తూ " నేను చిన్న చిన్న పనులు చేసే వాణ్ణి కాదని.. పెద్ద పనులే చేస్తాను" అని ఒకింత పరోక్షంగా పాక్‌ను ఆయన హెచ్చరించారు. ఇక్కడి వరకూ అంతా ఓకే గానీ ఆ తర్వాత మాట్లాడిన మాటలతోనే ఆయన తప్పులో కాలేశారు.
ఇక్కడే తప్పులో కాలేసింది..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ‘ఆయుష్మాన్ భారత్’.. దీని ద్వారా దేశ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఇప్పటికే పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. గుజరాత్ సభలో మాట్లాడుతూ.. ఈ పథకం ప్రకారం ఎక్కడి వాళ్లు అక్కడే వైద్యం చేయించుకోవచ్చని చెబుతూ కొన్ని ప్రాంతాల పేర్లు ఆయన ఉదహరించారు. జామ్నగర్కి చెందిన వ్యక్తి భోపాల్‌కి వెళితే అక్కడ అనుకోకుండా అనారోగ్యం పాలైతే వైద్యం కోసం మళ్లీ తిరిగి జామ్నగర్కి రావాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఉంటే చాలు దేశంలో ఎక్కడైనా సరే వైద్యం చేయించుకోవచ్చు అని.. అది కోల్‌కతా అయినా.. కరాచీ అయినా సరే అని మోదీ అనగానే జనాలంతా పక్కున నవ్వుకున్నారు. టక్కున తప్పులో కాలేశానని తెలుసుకున్న మోదీ.. అది కరాచీ కాదు.. కొచ్చి అని చెప్పుకొచ్చారు.
నా టార్గెట్ ఉగ్రవాదులు.. విపక్షాల టార్గెట్ నేను..!
చివరగా.. ఈ మధ్యకాలంలో మన పొరుగు దేశం విషయాలే తన మనస్సులో ఎక్కువగా ఉన్నాయని మోదీ కవర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా.. ఉగ్రవాదులను అంతం చేయడమే తన టార్గెట్ అన్నారాయన. అయితే విపక్ష పార్టీలకు మాత్రం తనను టార్గెట్ చేసుకున్నాయని అన్నారు. అంతే కాదు మోదీని అంతం చేయడమే లక్ష్యంగా విపక్ష పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయని మోదీ ఒకింత ఆగ్రహం.. ఆవేదనకు లోనై మాట్లాడారు. 2019లోనూ మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని తనకు తానుగా మోదీ జోస్యం చెప్పుకున్నారు. అయితే మోదీ ఎప్పుడు మాట జారుతాడా అని అవకాశం కోసం వేచి చూస్తున్న విపక్షాలు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments