Navdeep:మాదాపూర్ డ్రగ్స్ కేసు.. హీరో నవదీప్‌కు నార్కోటిక్ నోటీసులు, విచారణకు రావాల్సిందిగా ఆదేశం

  • IndiaGlitz, [Thursday,September 21 2023]

మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నవదీప్‌కు షాక్ తగిలింది. ఆయనకు నార్కోటివ్ విభాగం గురువారం 41 ఏ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఎన్‌సీబీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే తనను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు జారీ చేసిన బెయిల్ రద్దవ్వడంతో పోలీసులు.. తదుపరి చర్యలకు ఉపక్రమించారు. దీనిలో భాగంగా నవదీప్‌ను విచారించేందుకు సిద్ధమయ్యారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పోలీసులు 11 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ అమ్మకాలు జరిపే రాంచందర్‌తో నవదీప్‌కు ఉన్న సంబంధాలపై నార్కోటిక్ విభాగం ఇప్పటికే ఆధారాలు సేకరించింది. వాట్సాప్ ఛాట్‌తో పాటు కాల్ డేటాను కూడా సంపాదించారు. దీని ఆధారంగా నవదీప్‌ను ప్రశ్నించి మరిన్ని కీలక విషయాలు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇకపోతే.. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, తనను అకారణంగా ఇరికించారని నవదీప్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో నవదీప్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనను అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను హైకోర్ట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. గతంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను ఎక్సైజ్, ఈడీ అధికారులు విచారించారు. ఇప్పుడు మరోసారి నవదీప్‌కు నోటీసులు ఇవ్వడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. పోలీసుల విచారణలో ఇంకెంత మంది పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో మరో ఎనిమిది మందిని నార్కోటిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు నైజీరియన్లతో పాటు డ్రగ్స్ వాడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఓ సినీ నిర్మాత వున్నట్లుగా సమాచారం. వీరి వద్ద నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల కొకైన్, 24 ఎక్టసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

More News

Akhil Mishra:షూటింగ్‌లో ప్రమాదం .. 3 ఇడియట్స్ నటుడు మృతి, బాలీవుడ్ దిగ్భ్రాంతి

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హిందీ నటుడు అఖిల్ మిశ్రా ప్రమాదవశాత్తూ కన్నుమూశారు.

జీ తెలుగు ఆధ్వర్యంలో పర్యావరణ హితంగా అప్ సైకిల్డ్ గణేష్ నవరాత్రులు!

గణపతిబప్పా.. మోరియా’ అంటూ దేశమంతటా ఘనంగా జరుపుకొనే పండుగ ‘గణేష్ చతుర్థి’. వీధివీధినా మండపాలు ఏర్పాటు చేసి గణపతి నవరాత్రులను కోలాహలంగా నిర్వహిస్తారు.

Nandamuri Balakrishna:అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య.. దమ్ముంటే రా అంటూ అంబటి సవాల్, బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్‌పై నిరసన తెలిపారు.

Bigg Boss 7 Telugu : షర్ట్ విప్పేసిన గౌతమ్ .. ఛాలెంజ్ అంటూ శోభాశెట్టి విశ్వరూపం , పవర్ అస్త్ర కోసం శివాజీ దిగులు

బిగ్‌బాస్ 7 తెలుగులో పవర్ అస్త్ర కోసం ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Ysrcp MP:రిజర్వేషన్ లేకుండానే 50 శాతం పదవులు.. మహిళా సాధికారతే జగన్ లక్ష్యం : లోక్‌సభలో వైసీపీ ఎంపీలు

దశాబ్థాలుగా భారతీయ మహిళలు కన కల ఇన్నాళ్లకు నెరవేరింది.. అసాధ్యం అనుకున్న దానిని మోడీ షా ద్వయం సుసాధ్యం చేసి చూపించింది.