ఫిల్మ్‌ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఏసియన్ సినిమాస్ అధినేత
- IndiaGlitz, [Saturday,July 27 2019]
‘మా’(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్), నిర్మాతల మండలి ఎన్నికలు ఇలా వరుసగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందడి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో శనివారం నాడు ‘ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఎన్నికలు కూడా సర్వత్రా ఆసక్తిని పెంచాయి. ఈ ఎన్నికల్లో ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి బరిలోకి దిగిన ఏసియన్ సినిమాస్ అధినేత నారాయణదాస్ కె నారంగ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికపై పరిశ్రమ నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అలాగే తెలుగు సినిమా పరిశ్రమలో ఫైనాన్సియర్స్‌గా సుస్థిర స్తానం సంపాదించుకున్న నారాయణదాస్ నారంగ్ గారు 600కు పైగా సినిమాలకు ఫైనాన్సర్‌గా ఉన్నారు. అలాగే వందలాది సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు.
ఇంతకీ ఎవరీ నారంగ్!!
రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ఛైన్ ఆఫ్ థియేటర్స్ అయిన ఏసియన్ సినిమాస్‌ను విజయవంతంగా నడిపిస్తూ.. పరిశ్రమలో తనదైన ముద్రను వేశారు. ఇప్పటి వరకూ ఫైనాన్స్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో దూసుకుపోతోన్న ఏసియన్ సినిమాస్ రీసెంట్‌గా నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టింది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రంతో ఏసియన్ సినిమాస్ చిత్ర నిర్మాణం మొదలుపెట్టింది. మొత్తంగా చిత్ర పరిశ్రమతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నారాయణదాస్ నారంగ్ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు అందరూ. అలాగే ఆయన ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నారు.