‘ఎవరూ చేయని పని వైఎస్ జగన్ చేస్తున్నారు’
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని విజయం సొంతం చేసుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా ప్రమాణం చేసినప్పట్నుంచి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీసుకున్న కీలక, సంచలన నిర్ణయాలు మనందరమూ చూసే ఉంటాం. అంతేకాదు.. ఇప్పటి వరకూ ఎక్కడా.. ఎవరూ చేయని విధంగా కేబినెట్ కూర్పు కూడా జగన్ చేశారు. మరోవైపు పాదయాత్రలో ఇచ్చిన హామీలు.. ప్రభుత్వం ఏర్పాటు చేశాక తూ.చా తప్పకుండా అమలు చేయడం చూసి ఇది వరకూ పాలించిన ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీలు కూడా ఆశ్చర్యపోతున్నారు. తాజాగా జగన్ పాలనపై టాలీవుడ్ సీనియర్ నటుడు నారాయణ మూర్తి స్పందించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయని..!
‘స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయని అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు జగన్ చేపట్టి అమలు చేస్తున్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని కోరుకుంటున్నారు. రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టించినందుకు జగన్‌కు అభినందనలు. ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉంది. సామాజిక న్యాయం కోసం జగన్ చేస్తున్న కృషి ప్రశంసనీయం. జనాభాలో 54శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.. అది అభినందనీయం’ అని జగన్‌పై నారాయణమూర్తి మెచ్చుకున్నారు. కాగా టాలీవుడ్ నుంచి పెద్దలు.. జగన్ పరిపాలనపై ఇంతవరకూ ఎవరూ స్పందించిన దాఖలాల్లేవ్. అయితే ఫస్ట్ టైమ్ మూర్తి ప్రశంసలు కురిపించడంపై టాలీవుడ్ యాక్టర్స్ కమ్ వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com